ETV Bharat / international

ఆ దేశంలో టిక్​టాక్​పై నిషేధం ఎత్తివేత

author img

By

Published : Oct 19, 2020, 8:35 PM IST

టిక్​టాక్​పై విధించిన నిషేధాన్ని పాకిస్థాన్ ఎత్తివేసింది. అనైతిక కంటెంట్​ను వ్యాప్తి చేస్తున్న ఖాతాలను నియంత్రిస్తామని సంస్థ నుంచి వచ్చిన హామీతో నిషేధం తొలగించినట్లు వెల్లడించింది.

Pakistan lifts ban on TikTok
ఆ దేశంలో టిక్​టాక్​పై నిషేధం ఎత్తివేత

చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్​టాక్​పై పాకిస్థాన్ నిషేధం ఎత్తివేసింది. అనైతిక కంటెంట్​ను నియంత్రిస్తామని సంస్థ ఇచ్చిన హామీ మేరకు పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) టిక్​టాక్​ను అన్​బ్లాక్ చేసింది.

"అసభ్య, అనైతిక కంటెంట్​ను వ్యాప్తి చేస్తున్న ఖాతాలను నియంత్రిస్తామని టిక్​టాక్ మేనేజ్​మెంట్ నుంచి హామీ వచ్చిన తర్వాత నిషేధం తొలగించాలని నిర్ణయించాం. స్థానిక చట్టాలకు అనుగుణంగా ఖాతాలను టిక్​టాక్ సమీక్షిస్తుంది."

-పీటీఏ ట్వీట్

అనైతిక, అసభ్యకర కంటెంట్​కు వ్యతిరేకంగా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అక్టోబర్ 9న టిక్​టాక్​పై పీటీఏ నిషేధం విధించింది. నోటీసులపై స్పందించేందుకు కావాల్సిన సమయం ఇచ్చినా.. ఆ సంస్థ పూర్తి నిబంధనలు పాటించక విఫలమైందని అప్పట్లో పేర్కొంది.

పాక్​లో టిక్​టాక్​కు బాగా ప్రాచుర్యం ఉంది. ఆ దేశంలో యాప్ డౌన్​లోడ్​లు 4.3 కోట్లు దాటాయి. 2020 సంవత్సరంలోనే 1.47 కోట్ల మంది యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు.

ఇదీ చదవండి- మరో అరబ్​ దేశంతో ఇజ్రాయెల్​ 'దోస్తీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.