ETV Bharat / international

పాక్​, రొమేనియాకు కరోనా విస్తరణ- చైనాలో తగ్గుముఖం! - South Korea reports 334 new coronavirus cases

కరోనా వైరస్ మరో రెండు దేశాలకు వ్యాపించింది. పాకిస్థాన్, రొమేనియా దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది. పాక్​లో ఇద్దరు, రొమేనియాలో ఒకరికి వైరస్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. చైనాలో మాత్రం వైరస్ మరణాల సంఖ్య తగ్గుతోంది.

coronavirus
కరోనా వైరస్
author img

By

Published : Feb 27, 2020, 10:02 AM IST

Updated : Mar 2, 2020, 5:33 PM IST

చైనాలో కొవిడ్​-19 (కరోనా) వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. బుధవారం కేవలం 29 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న గత నెల రోజుల్లో ఇదే అత్యల్పం. కొత్తగా కరోనా సోకిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చైనాలో మొత్తం వైరస్ మరణాలు 2,744కు చేరుకున్నాయి.

దక్షిణ కొరియాలో బీభత్సం

దక్షిణ కొరియాలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 334 కేసులు నమోదైనట్లు ఆ దేశ యంత్రాంగం స్పష్టం చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,595కి చేరింది. చైనా అవతల అత్యధిక కేసులు దక్షిణ కొరియాలోనే నమోదయ్యాయి. అయితే కొత్తగా మరణాలు సంభవించలేదని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దక్షిణ కొరియాలో వైరస్ కారణంగా 12 మంది మృతి చెందారు.

కరోనా వైరస్ ప్రభావం అమెరికా- దక్షిణ కొరియా సంయుక్త మిలిటరీ విన్యాసాలపై పడింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

కొత్తగా ఈ దేశాలకు

కరోనా బాధితుల్లో మరో రెండు దేశాలు చేరాయి. పాకిస్థాన్, రొమేనియాలో నూతన కేసులు గుర్తించారు.

పాకిస్థాన్​లో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో ఒకరు ఇరాన్​ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ కుటుంబాన్ని పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. మరో 15 అనుమానిత కరోనా కేసులపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

రొమేనియాలో ఓ వ్యక్తికి కొవిడ్ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. ఆ దేశానికి వచ్చిన ఇటలీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.

ఐరోపాలోనూ కరోనా విస్తరిస్తోంది. ఉత్తర ఇటలీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇటలీ నుంచే ఐరోపాలోని చాలా ప్రాంతాలకు వైరస్ వ్యాపించినట్లు తెలుస్తోంది.

కరోనా ప్రభావానికి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2,700 మందికి పైగా బలయ్యారు. 34 దేశాల్లోని 80 వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది.

Last Updated : Mar 2, 2020, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.