ETV Bharat / international

గిల్గిట్​​-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా ఇచ్చే పనిలో పాక్ - గిల్గిత్​-బాల్టిస్థాన్​

కశ్మీర్​ అంశంలో పాక్​స్థాన్​కు ఎన్నిసార్లు భంగపాటు ఎదురైనా.. వక్రబుద్ధిని మార్చుకోవటం లేదు. తాజాగా పాక్​​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని గిల్గిట్​-బాల్టిస్థాన్​ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది.

Gilgit-Baltistan
గిల్గిట్​​-బాల్టిస్థాన్​
author img

By

Published : Sep 17, 2020, 3:41 PM IST

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని గిల్గిట్​-బాల్టిస్థాన్​కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం​. ఈ అంశాన్ని ఓ సీనియర్ మంత్రి వెల్లడించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపింది.

ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్​ కథనం ప్రకారం.. త్వరలోనే ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ గిల్గిట్​​-బాల్టిస్థాన్​ ప్రాంతంలో పర్యటిస్తారని కశ్మీర్​, గిల్గిట్​​-బాల్టిస్థాన్​ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమిన్​ గండాపుర్​ పేర్కొన్నారు. అన్ని రకాల రాజ్యాంగ హక్కులతో పూర్తిస్థాయి రాష్ట్రహోదాపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలిపారు. జాతీయ అసెంబ్లీ, సెనేట్​ సహా అన్ని రాజ్యాంగ సంస్థల్లో గిల్గిట్​​-బాల్టిస్థాన్​కు తగిన ప్రాతినిధ్యం ఇస్తామన్నారు.

చైనా, పాకిస్థాన్​ ఆర్థిక నడవా​(సీపెక్​) కింద మోక్​పాండస్​ ప్రత్యేక ఆర్థిక జోన్​ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు గండాపుర్​.

భారత్​ తిరస్కరణ..

గిల్గిట్​-బాల్టిస్థాన్​తో పాటు మొత్తం జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమేనని ఇప్పటికే పాక్​కు స్పష్టం చేసింది భారత్​. అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగంపై పాక్​కు ఎలాంటి హక్కులు లేవని తేల్చిచెప్పింది. ఆక్రమించుకున్న అన్ని భూభాగాలను ఖాళీ చేయాలని గత మే నెలలోనే సూచించింది. ఇప్పటికే.. సీపెక్​ కారిడార్​ పీఓకే నుంచి వెళ్తుండడంపై అభ్యంతరం ​వ్యక్తం చేసింది భారత్​.

ఇదీ చూడండి: ఆ ఎన్నికల నిర్వహణపై పాక్​ను తప్పుబట్టిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.