ETV Bharat / international

మరో​ క్రూయిజ్​ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన పాక్​

పాక్​.. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల బాబర్​ క్రూయిజ్​ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించింది. గత మూడు వారాల్లో ఆ దేశంలో ఇది మూడో క్షిపణి పరీక్ష కావడం విశేషం. ఈ ప్రయోగ పరీక్ష విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​, అధ్యక్షుడు ఆరిఫ్​ అల్వి.

Pak test-fires surface-to-surface cruise missile, third test in 3 weeks
బాబర్​ క్రూయిజ్​ క్షిపణి
author img

By

Published : Feb 11, 2021, 6:57 PM IST

పాకిస్థాన్​ గురువారం మరో క్రూయిజ్​ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ బాబర్​ మిసైల్​.. ఉపరితలం నుంచి ఉపరితలంలోని 450 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదిస్తుందని పాక్ సైన్యం ​తెలిపింది. ఫలితంగా.. మూడు వారాల్లో ఆ దేశంలో ఇది మూడో క్షిపణి పరీక్ష కావడం విశేషం.

ప్రధాని, అధ్యక్షులు అభినందనలు..

అత్యాధునిక మల్టీ-ట్యూబ్​ ప్రయోగ వాహనం నుంచి పరీక్షించిన బాబర్ క్షిపణి.. భూమి, సముద్రం వద్ద లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుందని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి ప్రయోగ కార్యక్రమంలో సీనియర్​ శాస్త్రవేత్తలు, రక్షణాధికారులు, ఆర్మీ స్ట్రాటజిక్​ ఫోర్సెస్​ సభ్యులు పాల్గొన్నారు.

ఈ ప్రయోగంపై హర్షం వ్యక్తం చేశారు ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్​ ఆరిఫ్​ అల్వి, ప్రధాని ఇమ్రాన్​ఖాన్​. ఇందులో పాల్గొన్న ప్రముఖులకు అభినందనలు తెలిపారు.

గతంలోనూ..

అంతకుముందు.. జనవరి 20న తొలుత బాలిస్టిక్​ క్షిపణి షాహీన్​-3(ఉపరితలం-ఉపరితలం)ను విజయవంతంగా పరీక్షించింది. దీనికి 2,750 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంటుందని దాయాది దేశం పేర్కొంది. ఆ తర్వాత.. ఫిబ్రవరి 3న 290 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల మరో బాలిస్టిక్​ మిసైల్(ఉపరితలం-ఉపరితలం)​నూ దిగ్విజయంగా పరీక్షించింది పాక్​.

ఇదీ చదవండి: అమెరికాకు హెచ్చరికగా చైనా క్షిపణి పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.