ETV Bharat / international

భారత దౌత్యవేత్తకు పాకిస్థాన్​ సమన్లు - భారత దౌత్యవేత్త

కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు​ నేపథ్యంలో భారత్​పై పాకిస్థాన్ విషం కక్కుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఒప్పందానికి కట్టుబడి ఉండేలా బలగాలను ఆదేశించాలని అందులో పేర్కొంది.

భారత దౌత్యవేత్తకు పాకిస్థాన్​ సమన్లు
author img

By

Published : Aug 16, 2019, 7:16 PM IST

Updated : Sep 27, 2019, 5:22 AM IST

నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఇస్లామాబాద్​లోని భారత దౌత్యవేత్తకు తాఖీదులిచ్చింది పాకిస్థాన్​. కాల్పులపై నిరసన వ్యక్తం చేసింది.

లిపా, బట్టాల్​ సెక్టార్లలో భారత బలగాలు నిష్కారణంగా కాల్పులు జరిపాయంటూ భారత డిప్యూటీ హైకమిషనర్​ గౌరవ్​ అహ్లువాలియాకు సమన్లు జారీ చేసింది పాక్​ విదేశాంగ కార్యాలయం. కాల్పుల్లో ఓ జవాను, ఇద్దరు పౌరులు మరణించినట్లు పేర్కొంది.

భారత బలగాలు కాల్పులకు పాల్పడుతున్నాయని అహ్లువాలియాకు వరుసగా గత బుధ, గురువారాల్లో సమన్లు జారీ చేసింది పాక్​.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించేలా సైనికులకు సూచించాలని కోరారు పాక్​ విదేశీ కార్యాలయం ప్రతినిధి మహమ్మద్​ ఫైసల్​. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని సూచించారు.

"భారత్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటం వల్ల ప్రాంతీయ భద్రత, శాంతికి విఘాతం కలుగుతోంది. అది విపత్కర పరిస్థితులకు దారితీయొచ్చు. " -

మహమ్మద్​ ఫైసల్​, పాక్​ విదేశాంగ ప్రతినిధి.

ఐరాస రక్షణ మండలి తీర్మానం ప్రకారం యూఎన్​ మిలటరీ పరిశీలన బృందాన్ని (యూఎన్​ఎంజీఐపీ) భారత్​ అనుమతించాలన్నారు ఫైసల్​. కానీ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది భారత్​. సిమ్లా ఒప్పందం తర్వాత యూఎన్​ బృందాన్ని అనుమతించటం అవసరం లేదని పేర్కొంది.

ఇదీ చూడండి: 'అలా చేస్తే 15 నిమిషాల్లోనే నిరసనలు బంద్'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.