ETV Bharat / international

పాకిస్థాన్​లో కరోనా విలయతాండవం - coronavirus latest updates in pak

పాక్​లో శనివారం ఒక్కరోజే 32మంది కరోనాతో మరణించారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం వైరస్​ మృతుల సంఖ్య 1,100లు దాటినట్లు తెలిపింది. ఇప్పటివరకు 54వేలకు పైగా మహమ్మారి బారిన పడ్డారని అధికారులు చెప్పారు.

Pak records 54,601 coronavirus cases; 1,133 fatalities
పాక్​లో కరోనా విలయతాండవం.. పెరుగుతున్న కేసులు
author img

By

Published : May 24, 2020, 2:27 PM IST

పాకిస్థాన్​లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 32మంది మహమ్మారి కారణంగా మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 1,133కు పెరిగిందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వైరస్​ బాధితుల సంఖ్య 54,601కు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాంతక కరోనా నుంచి 17,198మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 473,607మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని!

రాష్ట్రం కేసులు
సింధ్21,645
పంజాబ్19,557
కైబర్-పఖ్తున్​క్వా7,685
బలూచిస్థాన్3,306
ఇస్లామాబాద్1,592
గిల్గిత్​-బల్టిస్థాన్619
పాక్​ ఆక్రమిత కశ్మీర్197

భౌతిక దూరం పాటించాలి!

భౌతిక దూరం పాటిస్తూ ఈద్​ వేడుకలను జరుపుకోవాలని పాక్​ ప్రభుత్వ అక్కడి ప్రజలకు సూచించింది. బంధువుల ఇళ్లకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటివి మానుకోవాలని హితవు పలికింది.

ఇదీ చూడండి: హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.