ETV Bharat / international

గిల్గిత్-బాల్టిస్థాన్​లో ఎన్నికలపై భారత్​-పాక్​ ఢీ - india pak news

గిల్గిత్-బాల్టిస్థాన్​లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని పాకిస్థాన్​ అధ్యక్షుడు ఆరిఫ్​ అల్వి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని భారత్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Pak President Arif Alvi issues order to form caretaker govt,
గిల్గిత్-బాలిస్తాన్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం
author img

By

Published : May 18, 2020, 11:45 AM IST

గిల్గిత్​-బాల్టిస్థాన్​లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి. ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు పాక్ సుప్రీంకోర్టు ఇటీవలే అనుమతిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేశారు.

గిల్గిత్-బాల్టిస్థాన్​లో ఎన్నికలు నిర్వహించడాన్ని భారత్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జమ్ము కశ్మీర్​, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు గిల్గిత్​-బాల్టిస్థాన్​ భారత భూభాగంలోనే ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది. పాక్ సూప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా నిరసన వ్యక్తం చేసింది.

ఈ ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేలా 2018 పరిపాలనా ఉత్తర్వులను సవరించడానికి పాక్​ ప్రభుత్వానికి ఏప్రిల్ 30న ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అనంతరం గిల్గిత్-బాల్టిస్థాన్​ సహా కశ్మీర్, లద్దాఖ్​లు భారత్​లో అంతర్భాగమని పాక్​ సీనియర్ దౌత్య అధికారికి నిరసన తెలియజేసింది భారత విదేశాంగ శాఖ. అక్రమంగా, బలవంతంగా పాక్​ కలగజేసుకోవాలని ప్రయత్నిస్తోందని తెలిపింది.

గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రభుత్వ గడువు జూన్​ 24న ముగుస్తుంది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఎటువంటి నిబంధనలు లేవని, పాక్ అధ్యక్షుని ఆదేశాలతో ఆ సమస్య తీరిపోయిందని పాకిస్థాన్​ తెహ్రీక్​ ఏ ఇన్సాఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తెలిపారు. రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు.

గిల్గిత్-బాల్టిస్థా​లో రూ.442 బిలియన్లు విలువ చేసే డ్యామ్​ను నిర్మించేందుకు చైనాతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది పాక్. వివాదాస్పద భూభాగంలో ఇలాంటి ప్రాజెక్టు నిర్మించడం తగదని భారత్​ ఇప్పటికే స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.