చికిత్స పేరిట లండన్ వెళ్లిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తిరిగి పాకిస్థాన్‌కు రప్పించడానికి చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలని తమ పార్టీ నేతలకు సూచించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకతాటిపైకి వచ్చిన ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు ఖాన్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్న ప్రతిపక్షాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
పనామా పత్రాల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) నాయకుడు నవాజ్ షరీఫ్ చికిత్స పేరిట బెయిల్‌పై లండన్ వెళ్లారు. నవాజ్‌ను తిరిగి పాక్‌కు అప్పగించాలని గతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అభ్యర్థన లేఖ పంపింది పాక్. అయితే, ఇరు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం లేనప్పుడు షరీఫ్‌ను రప్పించడం కష్టమంటున్నారు విశ్లేషకులు.
ఇదీ చదవండి: 'పరారీ'లో షరీఫ్- బ్రిటన్ను ఆశ్రయించిన పాక్