14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న జమాతే ఉలేమా ఇ ఇస్లాం(జేయుఐ-ఎఫ్) నేత, పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ ఆయుబిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్రాల్ ప్రాంతంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో ఈమేరకు చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది...
బలూచిస్థాన్ జుఘూర్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ 14 ఏళ్ల బాలికను ఎంపీ మౌలానా సలాహుద్దీన్(50) వివాహం చేసుకున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ చిత్రాల్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేసింది. పాఠశాల రికార్డుల్లో బాలిక పుట్టిన తేదీ 2006 అక్టోబర్ 28గా ఉందని ఎన్జీఓ స్పష్టం చేసింది.
అయితే... వివాహం జరిగిందన్న ఆరోపణలను బాలిక తండ్రి తోసిపుచ్చారని చిత్రాల్ పోలీసు అధికారి పేర్కొన్నారు. 16 ఏళ్లు నిండే వరకు తనను ఎక్కడికీ పంపనని బాలిక తండ్రి సష్టం చేసినట్లు పేర్కొన్నారు.
పాకిస్థాన్లో 16 ఏళ్లలోపు బాలికలకు వివాహం నిషిద్ధం. ఈ నిబంధన ఉల్లంఘించిన తల్లిదండ్రులకు శిక్ష పడే అవకాశముంది.
ఇదీ చదవండి:ఒంటరితనంపై పోరుకు ప్రత్యేక మంత్రి