చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ మరోసారి ప్రయత్నిస్తోంది. భారత్ వాయుసేన యుద్ధవిమానాలను కూల్చేందుకు తాము ఎఫ్-16 విమానాలను వాడలేదని చెబుతోంది. చైనాతో సంయుక్తంగా రూపొందించిన జెఎఫ్-17 యుద్ధ విమానాన్ని వాడినట్లు పాక్ సైన్యం వివరణ ఇచ్చింది.
పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన మెరుపు దాడులు నిర్వహించింది. బదులుగా భారత్‌పైకి యుద్ధ విమానాలను ప్రయోగించింది పాక్. ఈ దాడిని దీటుగా ఎదుర్కొన్న భారత బలగాలు పాక్ యుద్ధ విమానాలను నేలమట్టం చేశాయి. పాకిస్థాన్ ప్రయోగించిన ఎఫ్-16 యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలను భారత భూభాగంలో సైన్యం గుర్తించింది. వాటిని ఆధారాలుగా ప్రపంచానికి చూపింది.
ఒప్పందం ప్రకారం ఎఫ్-16ను యుద్ధ విమానంగా ఉపయోగించరాదని అమెరికా తెలిపింది. దీనిపై పాక్‌ను వివరణ కోరింది.