పాక్ తన ద్వంద్వ వైఖరిని మరోసారి ప్రదర్శించింది. ఒకవైపు 'జైషే మహ్మద్' అధినేత మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని అంగీకరించిన పాక్... భారత్ సరైన ఆధారాలు అందిస్తేనే అతడిపై చర్యలు చేపడతామని తెలిపింది.
పాక్‌లో నివాసముంటున్న మసూద్ ఆరోగ్యం సరిగా లేదని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్ ఖురేషి వెల్లడించారు. న్యాయస్థానంలో కేసు నిలబడేందుకు బలమైన ఆధారాలను భారత్ అందిస్తేనే ప్రభుత్వం మసూద్‌పై తగిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
పుల్వామా దాడికి సంబంధించి పాక్‌లోని జైషే మహ్మద్ స్థావరాలపై, అధినేత మసూద్‌పై ఇప్పటికే ఆ దేశానికి పత్రాలు అందజేసింది భారత్. మహ్మద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాసను భారత్ ఎప్పటినుంచే కోరుతోంది.