ETV Bharat / international

పాక్​ జాగ్రత్త.. బ్లాక్​లిస్ట్​లో పెడతాం: ఎఫ్​ఏటీఎఫ్ - ఉగ్రవాద సంస్థలకు నిధులు

అక్రమ నగదు చలామణి, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసే కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయని పాకిస్థాన్, ఇరాన్​లపై ఎఫ్​ఏటీఎఫ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్​లోగా తగిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్​లిస్ట్​లో పెడతామని హెచ్చరించింది.

పాక్​ జాగ్రత్త.. బ్లాక్​లిస్ట్​లో పెడతాం: ఎఫ్​ఏటీఎఫ్
author img

By

Published : Jun 22, 2019, 9:31 AM IST

Updated : Jun 22, 2019, 1:06 PM IST

పాక్​ జాగ్రత్త.. బ్లాక్​లిస్ట్​లో పెడతాం: ఎఫ్​ఏటీఎఫ్

ఉగ్రవాదులకు నిధులు అందకుండా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయడంలో పాకిస్థాన్​ విఫలమైందని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్ (ఎఫ్​ఏటీఎఫ్​) పేర్కొంది. అక్టోబర్​ నాటికి ఈ కార్యాచరణను పూర్తి చేయాలని... లేకపోతే నిషేధిత జాబితా​లో చేర్చాల్సి వస్తుందని పాకిస్థాన్​తో పాటు ఇరాన్​నూ హెచ్చరించింది.

పారిస్​ కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్​ఏటీఎఫ్....​ ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా, అక్రమ నగదు చలామణిని అరికట్టడానికి కృషి చేస్తోంది. దేశంలో నిషిద్ధ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను పాకిస్థాన్​ గుర్తించి.. ఉగ్రవాదాన్ని అరికట్టాలని సూచించింది.

అక్టోబర్​ వరకు గడువు

ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహం, అక్రమ నగదు చలామణి సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్ఠ చట్టాలు లేని దేశాలను గ్రే లిస్ట్​లో ఉంచింది ఎఫ్​ఏటీఎఫ్​. ఆ జాబితాలో పాకిస్థాన్​ను కూడా గత ఏడాది చేర్చిందీ అంతర్జాతీయ సంస్థ.

ఫ్లోరిడాలోని ఓర్లాండోలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్​ఏటీఎఫ్​ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ జనవరి నాటికే కాకుండా... మే పూర్తయినా తన కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల అక్టోబర్​ వరకు కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇరాన్​ను కూడా ఇదే విధంగా హెచ్చరించింది.

ఏంటీ ఎఫ్​ఏటీఎఫ్​..?

ఎఫ్​ఏటీఎఫ్​.. ప్రస్తుతం 36 ఓటు హక్కుగల సభ్య దేశాలు, రెండు ప్రాంతీయ సంస్థలను కలిగి ఉంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. వచ్చే ఏడాది ఎఫ్​ఏటీఎఫ్​ అధ్యక్ష పదవిని చైనా దక్కించుకోనుండగా, గల్ఫ్ కో ఆపరేషన్​ కౌన్సిల్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌదీ అరేబియా ఈ సంస్థలో శాశ్వత సభ్యదేశంగా చేరనుంది.

ఈ సంస్థలో పాకిస్థాన్​కు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్​, భారత్​, యూరప్​ గళమెత్తగా, టర్కీ మాత్రమే పాకిస్థాన్​కు అండగా నిలిచింది.

ఇదీ చూడండి: ఇరాన్‌పై దాడికి సిద్ధమై మనసు మార్చుకున్న ట్రంప్‌!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rome - 21 June 2019
1. Wide of yoga lesson participants at Rome's Piazza del Campidoglio on World Yoga Day
2. Yoga teachers on stage
3. Tilt-down of man with t-shirt reading (English) "I love India"
4. Woman performing yoga poses
5. Various of Reenat Sandhu (centre), Indian Ambassador to Italy, participating in lesson
6. Various of yoga lesson
7. Tilt-down from Roman statues to participants
8. Various of participants posing
9. Tilt-down from Marco Aurelio equestrian statue to participants
10. Woman lying face down
11. Wide of lesson
12. Man posing
13. Wide of lesson, participants clapping
STORYLINE:
Hundreds of people joined a yoga lesson at the Piazza del Campidoglio on Rome's Capitol Hill on Friday to mark International Yoga Day.
Participants gathered in the square in front of Rome City Hall and practiced yoga from late afternoon until sunset.
Among those who took part was Reenat Sandhu, the Indian Ambassador to Italy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 22, 2019, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.