పాకిస్థాన్‌లోని గురుద్వారా నన్‌కానా సాహెబ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ.. పాక్ డిప్యూటీ హైకమిషనర్ 'సయీద్ హైదర్ షా'కు సమన్లు జారీ చేసింది భారత్. అలాగే పెషావర్‌లో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు నిరసనగా హైదర్ షా భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్‌లోని మైనారిటీలకు భద్రత, సంక్షేమంతో పాటు వారి పవిత్ర స్థలాలకు రక్షణ కల్పించేలా ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపింది.
గత శుక్రవారమే దాడి
సిక్కుల మత గురువు గురునానక్ జన్మస్థలంగా భావించే లాహోర్‌లోని గురుద్వారా నన్‌కానా సాహెబ్‌పై గత శుక్రవారం దాడి జరిగింది. కొందరు వ్యక్తులు గురుద్వారాను ధ్వంసం చేయాలని చూశారు. అనంతరం అక్కడి భక్తులపై దాడికి దిగారు. అలాగే పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సిక్కులే లక్ష్యంగా పాక్‌లో జరుగుతోన్న విధ్వంసకాండను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఇదీ చూడండి : దిల్లీ దంగల్: త్రిముఖ పోరులో నిలిచి గెలిచేదెవరో?