జైషే మహమ్మద్ అగ్రనేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐరాస ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వస్తోంది పాక్. అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా వ్యతిరేకించే విషయంలో వెనక్కి తగ్గాలని యోచిస్తోంది దాయాది దేశం.
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ బుధవారం తాజా ప్రతిపాదన చేశాయి. అజర్‌పై తీసుకునే చర్యలు స్పష్టంగా తెలియదని పాక్ భద్రతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
నాలుగోసారి
ఐరాస భద్రతామండలిలోని 15 సభ్యదేశాల్లో మూడు అంగీకరిస్తే 10 రోజుల్లో మసూద్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పదేళ్లలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన రావడం ఇది నాలుగోసారి. మొదటగా 2009, 2016లో భారత్ ప్రతిపాదించగా 2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతో కూడిన పీ-3 దేశాల కూటమి ప్రతిపాదించింది.