బాలీవుడ్ నటులు దిలీప్‌కుమార్, రాజ్‌కుమార్ పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుంక్వా ప్రభుత్వం నిర్ణయించిన రేటు పెంచాలని ఆ ఇళ్ల యజమానులు కోరారు. ప్రభుత్వ నిర్ణయించిన రేటు తక్కువగా ఉందనీ.. ప్రస్తుత మార్కెట్ రేటుకు అనుగుణంగా ఖరీదు కట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్‌కుమార్, దిలీప్‌కూమార్‌ల పూర్వీకులు నిర్మించిన ఇళ్లు పెషావర్‌లో ఉన్నాయి. ఈ రెండు ఇళ్లను ఖైబర్ పంఖ్తుంక్వా రాష్ట్ర పురావస్తుశాఖ తమ అధీనంలోకి తీసుకొని మ్యూజియాలుగా మార్చాలని నిర్ణయించింది. దిలీప్ కుమార్ నివాసానికి 80.56 లక్షలు.. రాజ్‌కపూర్ నివాసానికి కోటీ 50 లక్షల రూపాయల ధరను నిర్ణయించింది. ఐతే.. ఖైబర్ పంఖ్తుంక్వా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఇళ్లను ఇచ్చేందుకు నిరాకరించిన యజమానులు ప్రధాన కూడళ్ల వద్ద ఇళ్లు ఉన్నాయని, సరైన రేటు నిర్ణయించాలని పేర్కొన్నారు. దిలీప్ కుమార్ నివాసానికి 25 కోట్లు, రాజ్‌కపూర్ నివాసానికి 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: 'ఆ హీరో ఇల్లు 200 కోట్లు- కోటిన్నరకు ఎలా ఇస్తా?'