భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది పాకిస్థాన్. పాక్‌కు కశ్మీర్ మెడనరం వంటిదని వ్యాఖ్యానించారు ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖమర్ జావెద్ భజ్వా. భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చులకు పోయారు.
కార్ప్స్ కమాండర్స్ సమావేశంలో పాల్గొన్న భజ్వా.. కశ్మీర్ అంశంపై మాట్లాడారు.
"దేశ గౌరవం, ప్రతిష్ఠ, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వెయ్యబోం. ఈ విషయంలో భారత్ ఎలాంటి దుస్సాహసానికి ప్రయత్నించినా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. పాక్‌కు కశ్మీర్ మెడనరం వంటిది. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు."
-జనరల్ ఖమర్ జావెద్ భజ్వా, పాక్ సైన్యాధ్యక్షుడు
ఇదీ చూడండి: 'కశ్మీర్ ప్రగతి పయనం 'వందే భారత్'తో ఆరంభం'