ETV Bharat / international

ముంబయి పేలుళ్ల సూత్రధారికి పాక్ కోర్టు​ బెయిల్​

ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​కు పాకిస్థాన్​లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది. ప్రభుత్వ భూమిని అక్రమంగా వినియోగిస్తున్నారన్న కేసులో సయీద్​తో పాటు ముగ్గురు అనుచరులకు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో జామీను​ ఇచ్చింది.

author img

By

Published : Jul 15, 2019, 7:27 PM IST

ముంబై పేలుళ్ల సూత్రధారి సయీద్​కు ముందస్తు బెయిల్​

ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్​ ఉద్​ దవా (జేయూడీ) ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్​ సయీద్​తో పాటు అతని ముగ్గురు అనుచరులకు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ముందస్తు బెయిల్​ ఇచ్చింది. జమాత్ ఉద్​ దవా సంస్థ కార్యకలాపాల కోసం ప్రభుత్వ భూమిని అక్రమంగా వినియోగిస్తున్నారన్నది అభియోగం. ఈ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్​పై విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా జేయూడీ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టుకు సయీద్​ తరఫు న్యాయవాది తెలిపారు. బెయిల్​ పిటిషన్​ అంగీకరించాలని కోరారు. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆగస్టు 31 వరకూ అరెస్ట్​ చేయకుండా లాహోర్​లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది.

జేయూడీ సంస్థల సీజ్​..

అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితో జేయూడీ, ఎల్​ఈటీ, ఎఫ్​ఐఎఫ్​ సంస్థలపై పాక్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత మార్చిలో జేయూడీకి సంబంధించిన 160 శిక్షణ శిబిరాలు, 32 పాఠశాలలు, రెండు కళాశాలలు, నాలుగు ఆసుపత్రులు, 178 అంబులెన్సులు, 153 మందుల దుకాణాలను ప్రభుత్వం సీజ్​ చేసినట్లు పంజాబ్​ పోలీసులు తెలిపారు.

ఉగ్రవాద నిధుల సమీకరణ, అక్రమ నగదు బదిలీ కేసులను సవాలు చేస్తూ సయీద్​ దాఖలు చేసిన పిటిషన్​పై లాహోర్​ హైకోర్టు విచారణ చేపట్టింది. సమాధానం ఇవ్వాలని కోరుతూ పాక్ సర్కారు​, పంజాబ్ ప్రభుత్వం, తీవ్రవాద వ్యతిరేక విభాగానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జులై 30కి తీర్పు వాయిదా వేసింది.

23 కేసులు...

పంజాబ్​కు చెందిన తీవ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడీ) జులై 3న ఉగ్రవాద నిధుల సమీకరణపై హఫీజ్​ సయీద్​తో పాటు 13 మంది జేయూడీ నాయకులపై 23 కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సవాలు చేస్తూ గత శుక్రవారం లాహోర్​ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సయీద్​.

ఇదీ చూడండి: పాకిస్థాన్​కు 597 కోట్ల డాలర్ల జరిమానా..!

Intro:Body:

q

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.