భారత్ ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గింది. పాక్ చెరలో ఉన్న భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పౌర న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కల్పించాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశం అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం పాక్ సైనిక చట్టానికి సవరణలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియాలో వార్తలొస్తున్నాయి.
పాక్ సైనికుల చెరలో ఉన్న విదేశీ వ్యక్తులకు మిలిటరీ కోర్టులో అప్పీల్ చేసుకునే వీలు మాత్రమే ఉంది. పౌర న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేదు. అయితే కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐసీజే ఆదేశాన్ని అమలు చేయాలంటే సైనిక చట్టానికి సవరణ చేయక తప్పని పరిస్థితి. అందువల్ల ఆ చట్టానికి ప్రత్యేక మార్పులు చేస్తోంది పొరుగు దేశం.
ఇదీ చూడండి: శివసేన ముందు అగ్నీపథ్.. ఆస్పత్రి నుంచి రౌత్ ట్వీట్