శుక్రవారం దాదాపు 600 మంది భారతీయ సిక్కులు వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ చేరుకున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 551వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారతీయులు పాక్కు ప్రయాణమయ్యారు.
నవంబర్ 30న పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతంలోని గురుద్వారా జన్మస్థానమైన నన్కానా సాహిబ్ వద్ద ఈ జయంతి వేడుకలు జరగనున్నాయి.
" మొత్తంగా 602 మంది భారతీయ సిక్కులు పాకిస్థాన్ చేరుకున్నారు. 10 రోజుల పాటు వారు నంకానా సాహిబ్ ప్రాంతంలోని ఇతర గురుద్వారాలను కూడా సందర్శించనున్నారు. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) ఛైర్మన్ డా. అమీర్ అమ్మద్ సూచనల మేరకు యాత్రికుల కోసం ప్రత్యేక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు".
-అసిఫ్ హష్మి, ఈటీపీబీ ప్రతినిధి.
పంజాబ్ ఆరోగ్య శాఖ సిబ్బంది యాత్రికుల కొవిడ్-19 పరీక్ష ఫలితాలను పరిశీలించారని హష్మి తెలిపారు. ప్రతి ఏటా దాదాపు 2000 మంది భారతీయ సిక్కులు పాకిస్థాన్ వెళ్లేవారు కానీ ఈ ఏడాది కరోనా కారణంగా ఈ సంఖ్య చాలా మేరకు తగ్గింది.
ఇదీ చదవండి:బ్రిటన్ ప్రధాని బోరిస్తో మోదీ సంభాషణ