ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 15,19,195 కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారిన పడి మొత్తం 88,529 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా ఐరోపాకు చెందినవే. అత్యధికంగా ఇటలీలో 17,669 మంది మృతి చెందారు. 14,797 మరణాలతో అమెరికా రెండోస్థానికి చేరింది.
పాక్‌లోనూ విజృంభణ
పాకిస్థాన్‌లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా 248 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,322కి పెరిగింది. మరణాల సంఖ్య 63కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు...