ETV Bharat / international

యెమెన్​లో తీవ్ర ఘర్షణలు-100 మంది మృతి

యెమెన్​ మిలిటరీ బలగాలు, హౌతీ మిలీషియా మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 100 మంది ప్రాణాలు విడిచారు. థాయిజ్, మారిబ్​ ప్రాంతాల్లో ఈ ఘర్షణ తీవ్రతరమైనట్లు సైనికాధికారి ఒకరు స్పష్టం చేశారు.

Over 100 killed in Yemen clashes
యెమెన్​లో తీవ్ర ఘర్షణలు-100 మంది మృతి
author img

By

Published : Mar 7, 2021, 2:52 PM IST

యెమెన్​ ప్రభుత్వ బలగాలు, హౌతీ మిలీషియా మధ్య ఘర్షణలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయిజ్​ నైరుతి ప్రాంతంలో, చమురు అత్యధికంగా లభ్యమయ్యే మారిబ్​ ప్రాంతాల్లో శనివారం వివాదం చెలరేగినట్లు మిలిటరీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా హౌతీలు 'ఆల్​ఔట్ మిలిటరీ ఆపరేషన్స్'​ చేపడుతున్నారని.. 60 మంది హౌతీ మిలీషియా సభ్యులు, 36 మంది సైనికులు మృతి చెందారని అధికారి స్పష్టం చేశారు. ఈ వివాదంలో ఇరువర్గాల్లో చాలా మంది క్షతగాత్రులయ్యారు.

ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా యుద్ధ విమానాలను పంపి మారిబ్​లోని హౌతీ స్థావరాలపై దాడి చేస్తోంది. సౌదీ 26 సార్లు తమపై దాడి చేసినట్లు హౌతీ గ్రూప్​ పేర్కొంది. కానీ, ఆ దాడుల్లో మృతిచెందినవారిపై స్పష్టత ఇవ్వలేదు.

ఇదీ చదవండి:భారత సరిహద్దుల వరకు చైనా బుల్లెట్​ ట్రైన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.