ETV Bharat / international

చైనా దౌత్యవేత్తలను భయపెట్టిన 'అతడు'! - ఫిలిప్పీన్స్‌ విదేశాంగ మంత్రి టియోడోరో లోక్సిన్‌

చైనా దౌత్యవేత్తలు ట్విట్టర్లో ప్రత్యర్థులపై ఇష్టానుసారమైన భాష వాడుతుంటారు. దీంతో వుల్ఫ్​వారియర్​ డిప్లొమాట్లుగా వారికి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ, ఈ సారి సీన్​ రివర్సైంది. ట్విట్టర్‌లో ఠారెత్తించారు ఫిలిప్పీన్స్‌ మంత్రి. ఆయన వాడి భాష దెబ్బకు చైనా వారు కూడా బెంబేలెత్తిపోయారు.

Philippine foreign minister
ఫిలిప్పీన్స్‌ విదేశాంగ మంత్రి టియోడోరో లోక్సిన్‌
author img

By

Published : May 9, 2021, 6:35 PM IST

'ఇఫ్‌ యు ఆర్ బ్యాడ్‌.. ఐ యామ్‌ యువర్‌ డాడ్‌' అన్న రేంజిలో ఫిలిప్పీన్స్‌ విదేశాంగ శాఖ మంత్రి చైనాపై విరుచుకుపడ్డారు. సాధారణంగా చైనా దౌత్యవేత్తలు ట్విట్టర్లో ప్రత్యర్థులపై ఇష్టానుసారమైన భాష వాడుతుంటారు. దీంతో వుల్ఫ్‌వారియర్‌ డిప్లొమాట్లుగా వారికి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ, ఈ సారి సీన్‌ రివర్సైంది. ఫిలిప్పీన్స్‌ విదేశాంగ మంత్రి టియోడోరో లోక్సిన్‌ చైనాపై వాడిన భాష దెబ్బకు వారు కూడా బెంబేలెత్తిపోయారు. ఫిలిప్పీన్స్‌-చైనా మధ్య నెలకొన్న దక్షిణ చైనా సముద్ర వివాదం దీంతో మరింత ముదిరింది.

అసలేం జరిగింది..?

మే 3వ తేదీన ఫిలిప్పీన్స్‌ విదేశాంగ శాఖ మంత్రి టియోడోరో లోక్సిన్‌ చైనాపై ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. "చైనా.. నా మిత్రుడా, నేను ఈ విషయాన్ని ఎలా చెప్పాలి?" అంటూ మొదలు పెట్టి బూతులు అందుకొన్నారు. ఫిలిప్పీన్స్‌ స్నేహాన్ని చైనా దుర్వినియోగం చేస్తోందనే అర్థం వచ్చేట్లు ట్వీట్‌ చేశారు. దానికి కొనసాగింపుగా మరో ట్వీట్‌ చేశారు. 'ఐరాసలో రోడ్రిగా డ్యుటెరెట్టి చెప్పినట్లు.. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానంలో మాకు అనుకూలంగా వచ్చిన తీర్పునకు విలువ ఉంది. ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదా?' అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ల పరంపర అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. దీనిపై చైనా స్పందిస్తూ.. కనీసం దౌత్య భాష వాడితే మేము స్పందిస్తామంటూ పేర్కొంది. ఆ తర్వాత టియోడోరో కూడా తన భాషపై విచారం వ్యక్తం చేశారు.

మరోపక్క ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి కూడా తాము వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. వాస్తవానికి అమెరికాతో రక్షణ ఒప్పందం ఉండటం వల్ల ఫిలిప్పీన్స్‌ ధైర్యంగా చైనాపై ఎదురుదాడి చేస్తోంది. మరోపక్క అమెరికా కూడా ఫిలిప్పీన్స్‌కు మద్దతు తెలిపింది. గతంలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్‌ స్పందిస్తూ.. తమ మిత్రదేశానికి మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు.

నేపథ్యం ఇదీ..

మార్చి 7వ తేదీన వివాదాస్పద జూలియన్‌ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలివచ్చాయి. చైనా చేపలవేట ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. అప్పట్లో ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి డెల్ఫెన్‌ లోరెన్జాన మాట్లాడుతూ అక్కడకు వచ్చినవారు మత్స్యకారులు కాదని.. చైనా సముద్రపు దుండగుల మూక అని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలోనే ఈ ద్వీపం ఉంటుంది. అప్పటి నుంచి వారు అక్కడే తిష్ఠవేసుకొని ఉండిపోయారు. అన్నాళ్లు చేపలు పట్టడం ఏమిటో చైనాకే తెలియాలి.

అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనాతో స్నేహంగా ఉండేందుకు.. వీలైనంత ఉదాసీనంగా వ్యవహరించారు. అయినా చైనా తీరులో ఏమాత్రం మార్పురాలేదు. దక్షిణ చైనా సముద్రం తమదే అన్న వాదనలో ఏమాత్రం తగ్గలేదు. 2016 తీర్పును గుర్తించేది లేదని తెగేసి చెప్పింది. మరోపక్క రక్షణ భాగస్వామిగా ఉన్న అమెరికాతో ఒప్పందాలను రద్దు చేసుకొనేందుకు కూడా డ్యుటెరెట్టి ప్రయత్నించారు. ఈ చర్య మిత్రదేశమైన అమెరికాను దూరం చేసిందే తప్ప చైనాను దగ్గర చేయలేదు.

ఉదాసీనతే అలుసుగా తీసుకొని..

దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలపై అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన దేశం ఫిలిప్పీన్స్‌. అంతకుముందు ఫిలిప్పీన్స్‌ నౌకాదళం చైనా పడవలను అడ్డుకొంది. దీంతో 2012లో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. ఫిలిప్పీన్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకుని చైనా ఓ ఎత్తుగడ వేసింది. ఫిలిప్పీన్స్‌ రైతులు పండించే అరటి పండ్లకు చైనానే అతిపెద్ద మార్కెట్‌. దీంతో ఫిలిప్పీన్స్‌ అరటిపండ్ల నాణ్యతకు వంకలు పెట్టి కొనుగోళ్లను తగ్గించింది. వందల కొద్దీ కంటైనర్లను తిప్పి పంపడం మొదలుపెట్టింది. అపరిశుభ్రంగా ఉన్నాయని కొన్నింటిని ధ్వంసం కూడా చేసింది. తర్వాత ఇతర పండ్లను కొనేందుకు కూడా సాకులు చూపడం మొదలుపెట్టింది. దీంతో ఫిలిప్పీన్స్‌లోని కొన్ని లక్షల మంది రైతులు అవస్థలు పడ్డారు. బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. 2016లో తాము అమెరికాకు దూరం అయ్యే అవకాశాలున్నాయని ఫిలిప్పిన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి సంకేతాలు ఇవ్వడంతో చైనా శాంతించింది. దిగుమతులను పెంచింది.

దక్షిణ చైనా సముద్రంపై ఎందుకాసక్తి..?

దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌, వియత్నాం, తైవాన్‌, బ్రునై, మలేషియా వంటి దేశాలున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుంచి 200 నాటికల్‌ మైళ్ల దూరం వరకు ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ 200 నాటికల్‌ మైళ్ల దూరం ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ ఆ దేశానికి దక్కుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం డ్రాగన్‌ దక్షిణ చైనా సముద్రంలో సర్వే జరిపితే భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. దీంతో వీటిని సొంతం చేసుకోవడం కోసం రకరకాల ఉపాయాలు ఆలోచిస్తోంది. ఈ సముద్రంలోని చాలా దీవులు తనవే అని చెబుతోంది. వీటికి రకరకాల వాదనలు తెస్తోంది. వీటిల్లో స్పార్ట్‌లీ దీవులు కీలకమైనవి. వీటిని దక్కించుకోవడానికి చైనా ఏకంగా ఒక దీవిని కృత్రిమంగా విస్తరించి అక్కడ తన యుద్ధవిమానాలను మోహరించింది. దీంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ దీవుల్లో క్రీస్తు పూర్వం 200 సమయంలో చైనా ప్రజలు ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చేవారని.. అందుకే ఇది తమదని పేర్కొంటోంది. అప్పట్లో హాన్‌ వంశం దీనిని కనుగొందని చెబుతోంది. వాస్తవానికి 1877లో బ్రిటన్‌ దీనిని కనుగొంది.

ఇదీ చూడండి: భారత్​-పాక్​కు సౌదీ 'చర్చల' సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.