ETV Bharat / international

ఎవరెస్టు పర్వతాన్నీ వదలని కరోనా! - ఎవరెస్టు పర్వాతారోహకుడికి కరోనా

ఎవరెస్టు పర్వతంపై మొదటిసారి ఓ కరోనా కేసు వెలుగు చూసింది. బేస్​ క్యాంపు వద్ద నార్వేకు చెందిన ఓ పర్వతారోహకుడికి శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దాంతో అతడిని చికిత్స కోసం కాఠ్​మాండూలోని ఓ ఆస్పత్రికి హెలికాప్టర్​ ద్వారా తరలించారు.

everest moutain
ఎవరెస్టు పర్వతంపై కరోనా కేసు
author img

By

Published : Apr 23, 2021, 5:26 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం.. ఎవరెస్టు శిఖరాన్ని కూడా తాకింది. నార్వేకు చెందిన ఎర్లెండ్​ నెస్​ అనే పర్వాతారోహకుడికి ఎవరెస్ట్ బేస్​ క్యాంపులో కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. దాంతో అతణ్ని హెలికాప్టర్​ ద్వారా కాఠ్​మాండూలోని ఓ ఆస్పత్రికి అధికారులు తరలించారు.

ఎవరెస్టు పర్వతంపై కరోనా కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో తనకు కొవిడ్ పాజిటివ్​గా తేలినట్లు ఎర్లెండ్​ నెస్ తెలిపారు. అంతకుముందు.. గురువారం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్​గానే ఉన్నట్లు చెప్పారు. ఎర్లెండ్​నెస్​కు కరోనా సోకిన నేపథ్యంలో.. తక్షణమే బేస్​ క్యాంపులోని మిగతా వారికి పరీక్షలు చేపట్టకపోతే.. వందలాది మంది ఇతర పర్వాతారోహకులకు వైరస్​ సోకుతుందని పర్వాతారోహక బృందానికి మార్గదర్శకుడైన ఆస్ట్రియన్​​ లుకాస్​ ఫర్టెన్​బాచ్​ హెచ్చరించారు. తద్వారా.. పర్వాతారోహణకు అనుకూలమైన మే నెల వృథాగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

"బేస్​ క్యాంపులోని అందరికీ పరీక్షలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి పరీక్షలు జరపడం సహా ప్రతి బృందాన్ని ఐసొలేట్​ చేయాలి. వారి మధ్య ఎలాంటి కాంటాక్ట్స్​ లేకుండా చూడాలి. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి. లేదంటే చాలా నష్టం ఎదురవుతుంది. కొన్నివారాలుగా ఎర్లెండ్​ నెస్​ మిగతా వారితో కలిసే ఉన్నాడు."

-ఆస్ట్రియన్​​ లుకాస్​ ఫర్టెన్​బాచ్, పర్వాతారోహక బృంద మార్గదర్శకుడు

అయితే.. ఎవరెస్ట్​పై ప్రస్తుతం ఎలాంటి యాక్టివ్​ కేసులు లేనట్లు నేపాల్​కు చెందిన ఓ అధికారి తెలిపారు.

కరోనా నేపథ్యంలో గతేడాది ఎవరెస్టు పర్వాతారోహణను నిలిపివేసిన నేపాల్​ ప్రభుత్వం.. ఈ ఏడాదే తిరిగి ప్రారంభించింది.

ఇదీ చూడండి: భారత్​కు టీకా సాయంలో పంతం వీడని అమెరికా!

ఇదీ చూడండి: భారత్​ను ఆదుకోవాలని బైడెన్​కు సెనేటర్ల వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.