ETV Bharat / international

తీరుమారని కిమ్.. మరోసారి ఆయుధ పరీక్షలు! - north korea missile tests

ఉత్తరకొరియా మరోసారి క్షిపణి పరీక్షలు చేసిందని ప్రకటించింది దక్షిణకొరియా. క్షిపణి పరీక్షలపై విధించుకున్న స్వీయ నిషేధాన్ని ఎత్తివేస్తూ తాజాగా రెండు ఆయుధ పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. తూర్పు తీరంలో ఈ ఆయుధ పరీక్షలను గమనించినట్లు స్పష్టం చేసింది దక్షిణ కొరియా.

kim
తీరుమారని కిమ్.. మరోసారి ఆయుధ పరీక్షలు!
author img

By

Published : Mar 2, 2020, 11:51 AM IST

Updated : Mar 3, 2020, 3:28 AM IST

దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలపై విధించుకున్న స్వీయనిషేధాన్ని ఎత్తివేస్తూ కొన్ని వారాల క్రితం నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా.. తాజాగా మరోసారి ఆయుధ పరీక్షలు జరిపింది. రెండు గుర్తు తెలియని ఆయుధాలను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. తూర్పు తీరం దిశగా ఆయుధ పరీక్షలను నిర్వహించడాన్ని గమనించినట్లు దక్షిణ కొరియా అధికారులు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు విఫలమైన తర్వాత గత ఏడాది చివరలో పలు ఆయుధాలను ఉత్తర కొరియా పరీక్షించింది.

అణ్వాయుధ పరీక్షలు జరపబోమన్న మాటకు ఇకపై కట్టుబడి ఉండబోమని, త్వరలో తమ కొత్త ఆయుధాన్ని ప్రపంచం చూస్తుందని అప్పట్లోనే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెప్పారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే వివిధ ఆయుధాల పరీక్షలు జరుగుతున్నట్లు దక్షిణ కొరియా భావిస్తోంది. గత ఏడాది డిసెంబరులో కీలకమైన ఇంజిన్‌ పరీక్షలను కూడా నిర్వహించింది నిర్వహించింది ఉత్తరకొరియా. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అనేక దేశాలు ఉత్తర కొరియా అణ్వస్త్ర కార్యక్రమంపై ఆంక్షలు విధించాయి.

ఇదీ చూడండి: ‘కరోనా’ అనుమానితుడిని కాల్చి చంపిన ఉత్తరకొరియా

Last Updated : Mar 3, 2020, 3:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.