ఉత్తర కొరియా మరోసారి అత్యంత కీలకమైన పరీక్షలను నిర్వహించింది. గత సోమవారం తమ సోహీ ఉపగ్రహ ప్రయోగ వేదిక నుంచి ఈ పరీక్షను చేసినట్లు వెల్లడించింది. అయితే అది క్షిపణి పరీక్షా కాదా అన్న విషయమై స్పష్టీకరించలేదు కిమ్ దేశం.
"2019 డిసెంబర్ 7న సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఓ కీలకమైన పరీక్ష నిర్వహించాం."
-ఉత్తర కొరియా సైన్స్ అకాడమి ప్రకటన
ఈ పరీక్షల కారణంగా వ్యూహాత్మకంగా ఉత్తర కొరియా మరింత బలోపేతమవుతుందని కిమ్ దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ వ్యాఖ్యానించింది. అమెరికాతో అణ్వాయుధ నిరాయుధీకరణ చర్చలు పుఃన ప్రారంభమౌతాయన్న వార్తల నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్షలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత మే నెల నుంచి ఇప్పటివరకు 12 సార్లు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించింది.
ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు
తమకు బలమైన సైన్యం ఉందని కానీ దానిని ఉపయోగించకూడదని ఆశిస్తున్నామంటూ నాటో సదస్సు వేదికగా ఉత్తర కొరియా వైఖరిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు ఉత్తర కొరియా విదేశాంగమంత్రి. ట్రంప్‌ను వివేకం లేని వ్యక్తిగా అభివర్ణించారు.
ఇదీ చూడండి: రాజకీయ బాసుల ప్రభావంతో అవినీతి నిరోధక అఫిడ'విట్లు'