ETV Bharat / international

China: ముగ్గురు పిల్లలా.. వద్దు బాబోయ్‌..! - ముగ్గురు పిల్లల విధానాన్ని పాటించలేమంటున్న చైనా ప్రజలు

ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనవచ్చంటూ.. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి సెలవుల విషయంలో ఎలాంటి ముందస్తు మార్గదర్శకాలు జారీ చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగినులకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు.

chinese on three children policy
చైనా ముగ్గురు పిల్లల విధానంపై ప్రజల అభిప్రాయం
author img

By

Published : Jun 2, 2021, 5:27 AM IST

జనాభా నియంత్రణపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనేందుకు తాజాగా చైనా ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానంగా ఉద్యోగినులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి సెలవుల విషయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వాపోతున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు ఎలాంటి ముందస్తు మార్గదర్శకాలు జారీ చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగినులకు ఇబ్బందులు తప్పవంటున్నారు.

మరోవైపు మూడో సంతానంపై ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు. పిల్లల పెంపకం, వారి చదువులకయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కేవలం ఒక సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో అతి కొద్దిమంది మాత్రమే రెండో సంతానానికి మొగ్గు చూపుతున్నారు. 2016 నుంచి ఇద్దరు పిల్లల్ని కనేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించినా, ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు.

"నేను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మాకిద్దరు పిల్లలు. వారిని పెంచేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల మా అత్తయ్య మంచం పట్టారు. అప్పటి నుంచి వారి ఆలనాపాలనా చూసేవారే లేరు. ఏదో అలా కాపురం నెట్టుకొస్తున్నాం తప్ప.. ఆనందంగా జీవించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మూడో సంతానం ఎందుకు? ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. చాలామంది ఇలానే ఆలోచిస్తున్నారు" అని ఓ చైనా మహిళ అంతర్జాలంలో నిర్వహించిన చర్చాగోష్ఠిలో పేర్కొన్నారు. చైనాలో చాలామంది సాధారణ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు.

ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిస్తూ సోమవారం చైనా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన తర్వాత వార్తా ఛానళ్లలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిచ్చే ముందు.. ప్రసూతి మహిళల హక్కులు, యాజమాన్యం కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని అభిప్రాయపడ్డారు. 'ఇద్దరు ముద్దు.. మూడోది అసలే వద్దు' అన్నదే సగటు చైనీయుల మనోగతం.

ప్రసూతి సెలవుల మంజూరులో వివక్ష

చైనాలో ప్రసూతి సెలవులను ఇచ్చే విషయంలో వివక్ష ఉందనే ప్రచారం ఉంది. ఏదైనా సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తమకు పిల్లలు కనాలని ఉందని చెబితే, వారిని ఉద్యోగం నుంచి తొలగించే సందర్భాలు ఎదురవుతాయనే వాదనలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఈ విషయంలో ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే విధుల్లోకి తీసుకుంటున్నాయని కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకరిని కనేందుకే సవాలక్ష నిబంధనలు ఎదురైనప్పుడు మూడో సంతానానికి ప్రభుత్వం అనుమతిచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: మరో చైనా టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం

:చైనాలోని ఆ పట్టణంలో మళ్లీ లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.