ETV Bharat / international

మోదీ పర్యటనతో ఉలిక్కిపడిన చైనా.. ఏమందంటే?

భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ తూర్పు లద్దాఖ్​లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై స్పందించింది చైనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్రిక్తతలను పెంచే విధంగా వ్యవహరించకూడదని చెప్పింది. చర్చలతోనే ఇరువర్గాలు సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపింది.

bharat- china
'చర్చలతోనే భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం'
author img

By

Published : Jul 3, 2020, 4:58 PM IST

Updated : Jul 3, 2020, 5:05 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్​ పర్యటనతో చైనా ఉలిక్కిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దు వెంట ఉద్రిక్తతలను పెంచే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రకటన విడుదల చేశారు.

భారత్, చైనా మధ్య సానుకూల చర్చలతోనే సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతాయని చెప్పారు లిజియాన్.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. త్రిదళాధిపతి బిపిన్​ రావత్, సైన్యాధిపతి నరవాణేతో కలిసి తూర్పు లద్దాఖ్​లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

మే మొదటివారం నుంచి భారత్- చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు జూన్ 15, 16 తేదీల్లో జరిగిన ఘర్షణతో తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఆకస్మిక పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'వీరత్వంతోనే శాంతి- మన శక్తి, సామర్థ్యాలు అమేయం'

Last Updated : Jul 3, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.