ETV Bharat / international

భారత్​కు పాక్ గగనతలాన్ని మూసేయలేదు: ఖురేషీ - No decision yet on airspace closure to India

భారత దేశానికి తమ గగనతలాన్ని మూసివేయలేదని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మహమూద్‌ ఖురేషీ స్పష్టం చేశారు. పూర్తి సంప్రదింపులు, చర్చలు జరిపి ప్రతి అంశాన్నీ పరిశీలించిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని స్పష్టం చేశారు. తుది నిర్ణయం పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ చేతిలో ఉందని ఖురేషీ వెల్లడించారు.

భారత్​కు పాక్ గగనతలాన్ని మూసేయలేదు: ఖురేషీ
author img

By

Published : Aug 29, 2019, 1:14 PM IST

Updated : Sep 28, 2019, 5:33 PM IST

భారత్​కు పాక్ గగనతలాన్ని మూసేయలేదు: ఖురేషీ

భారతదేశానికి తమ గగనతలాన్ని మూసివేయలేదని, ఇంకా ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మహమూద్‌ ఖురేషీ స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని కోణాలను పరిశీలించి.. సంప్రదింపులు, చర్చలు జరిపిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

భారతదేశ విమానాలు ప్రయాణించకుండా... పాక్ తన గగనతలాన్ని మూసివేసిందన్న వార్తలను ఖురేషీ కొట్టిపారేశారు. ఇటీవలే జరిగిన కేంద్ర మంత్రివర్గ​ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చిందని.. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధానమంత్రి ఇమ్రాన్ ​ఖాన్ తీసుకుంటారని ఖురేషీ స్పష్టం చేశారు.

పొంతనలేని ప్రకటనలు..

పాక్​ శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్​ చౌదరి ట్విట్టర్​ వేదికగా భారత్​పై తన అక్కసు వెళ్లగక్కారు. భారతదేశానికి.. తమ గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పాక్​ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.

ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే... భారత్​కు తమ గగనతలాన్ని మూసివేయలేదని పాక్ విదేశాంగమంత్రి ప్రకటించడం గమనార్హం.

అప్పటి నుంచే మొదలైంది..

బాలాకోట్​ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి చేసిన తర్వాత ఫిబ్రవరిలో తన వాయు మార్గాన్ని పూర్తిగా నిలిపేసినట్లు పాక్​ ప్రకటించింది. ఆ తర్వాత మే 15 నుంచి మరో 15 రోజులు ఈ నిషేధాన్ని కొనసాగించింది.

ఆర్టికల్​ 370 రద్దుతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ తరుణంలోనే భారత్​తో దౌత్య, వాణిజ్య సంబంధాలను పాక్​ తెంచుకుంది. బస్సు, రైలు సర్వీసులను కూడా రద్దు చేసింది.

ఇదీ చూడండి: తమిళనాట 'ఐఎస్' ఉగ్రకలకలం... ఎన్​ఐఏ సోదాలు

AP Video Delivery Log - 0400 GMT News
Thursday, 29 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0350: South Korea Japan No Access South Korea 4227166
President Moon berates Japan for trade war
AP-APTN-0321: Australia Detained Writer No Access Australia 4227165
Aus PM Morrison on writer detained in China
AP-APTN-0301: Thailand Appeal AP Clients Only 4227164
Killers of British tourists await appeal result
AP-APTN-0225: El Salvador US Homeland AP Clients Only 4227163
Acting US Homeland Secretary meets President
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.