ETV Bharat / international

పాక్ స్టాక్​ మార్కెట్​పై దాడి కేసులో కొత్త ట్విస్ట్

పాక్​ స్టాక్​ ఎక్స్ఛేంజిపై దాడి తమ పని కాదని బలూచిస్థాన్​ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆజాద్ బలూచ్ ప్రకటించారు. బీఎల్​ఏ పేరు చెప్పుకొని ఈ దాడిలో పాల్గొన్నవారిని ఎప్పుడో బహిష్కరించినట్లు వెల్లడించారు.

Karachi Stock Exchange
పాక్ స్టాక్​ ఎక్స్ఛేంజి
author img

By

Published : Jul 1, 2020, 2:26 PM IST

పాకిస్థాన్ స్టాక్​ ఎక్స్ఛేంజిపై ఉగ్రదాడితో తమకెలాంటి సంబంధం లేదని బలూచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీ (బీఎల్​ఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు బీఎల్​ఏ అధికార ప్రతినిధి ఆజాద్ బలూచ్​ ప్రకటన విడుదల చేశారు.

దాడిపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు ఆజాద్​. బీఎల్​ఏ పేరు చెప్పుకొని దాడికి పాల్పడినవారిని సంస్థ నుంచి ఎప్పుడో బహిష్కరించామని తెలిపారు.

"పాక్ స్టాక్ ఎక్స్ఛేంజిపై దాడి చేసిన యువకులు బీఎల్​ఏకు చెందిన వారు కాదు. ప్రజలపై దాడులు చేయటం మా వ్యుహంలో భాగం కాదు."

- ఆజాద్ బలూచ్​

కరాచీలోని పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజిపై నలుగురు సాయుధులు తుపాకులు, గ్రనేడ్లతో దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది, ఓ పోలీస్ అధికారి, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ఉగ్రవాదులు కాసేపటికే హతమయ్యారు. ఇది తమ పనేనని బీఎల్​ఏ ప్రకటించినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

స్వతంత్రం కోసం..

బలూచిస్థాన్​ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా 'స్వతంత్రం' కోసం పోరాడుతోంది. అపార సహజవాయు నిక్షేపాలున్న బలూచిస్థాన్​ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ పోరాటంలో భాగంగా గత కొన్ని ఏళ్లుగా కరాచీలో వరుస దాడులకు పాల్పడుతున్నారు బీఎల్​ఏ సభ్యులు. 2018 నవంబర్​లో చైనా దౌత్య కార్యాలయంపై చేసిన దాడిలో ఇద్దరు మరణించారు.

ఇదీ చూడండి: పాక్ స్టాక్ మార్కెట్​పై దాడి- బలూచ్ ముష్కరుల పనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.