ETV Bharat / international

'ఇంకా ఎక్కువ మందినే కాల్చాలనుకున్నా!'

న్యూజిలాండ్​లోని రెండు ప్రార్థనా స్థలాలపై గత ఏడాది జరిగిన దాడి ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. 51 మందిని పొట్టన పెట్టుకున్న నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఇంకా ఎక్కువ మందినే కాల్చాలనుకున్నా అని పేర్కొనటం గమనార్హం. నిందితుడిపై 51 హత్యలు, 40 హత్యాయత్నాలు, తీవ్రవాదం తదితర నేరాలపై విచారణ జరుగుతోంది.

New-Zealand-shooter
ఇంకా ఎక్కువ మందినే కాల్చాలనుకున్నా..
author img

By

Published : Aug 24, 2020, 1:21 PM IST

గత ఏడాది న్యూజిలాండ్‌లోని ప్రార్థనా స్థలాలపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనలో 51 మందిని పొట్టన పెట్టుకున్న నిందితుడు ఏ మాత్రం పశ్చాత్తాపానికి గురికాకుండా 'ఇంతకంటే ఎక్కువ మందిని కాల్చాలని అనుకున్నా' అని చెప్పడం గమనార్హం. ఆస్ట్రేలియాకు చెందిన ఈ వ్యక్తి గత సంవత్సరం న్యూజిలాండ్‌లోని రెండు ప్రార్థనా మందిరాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

ప్రథకం ప్రకారమే..

2017లో ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన 29 ఏళ్ల బ్రెటన్‌ టారాంట్‌.. క్రైస్ట్‌చర్చ్‌కు 360 కి.మీ దూరంలోని డ్యునెడన్‌లో నివాసం ఏర్పర్చుకున్నాడు. ఓ పథకం ప్రకారమే భారీగా ఆయుధాలను సమకూర్చుకున్నాడు. దాడికి రెండు నెలల ముందు డ్రోన్‌తో‌ రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. అంతేకాకుండా ప్రార్థనా స్థలాలను దహనం చేసేందుకు పెట్రోల్‌ టిన్నులు కూడా సిద్ధం చేసుకున్నాడు.

సామాజిక మాధ్యమాల్లో లైవ్‌స్ట్రీమ్‌

మార్చి 15, 2019లో సుమారు గంట సేపు బ్రెటన్‌ టారాంట్‌ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ ఘటనను సామాజిక మాధ్యమాల్లో లైవ్‌స్ట్రీమ్‌ చేశాడు. ఈ విధంగా రెండు ప్రార్థనా స్థలాలపై దాడి అనంతరం మూడోదాని వైపు వెళుతుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి కాలిని పట్టుకుని ఉన్న మూడేళ్ల ఓ చిన్నారిని కూడా కాల్చేసినట్లు అధికారులు తెలిపారు. అతనను పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్‌ కోర్టుకు వివరించింది.

బ్రెటన్‌ టారాంట్‌పై 51 హత్యలు, 40 హత్యాయత్నాలు, తీవ్రవాదం తదితర నేరాలపై విచారణ జరుగుతోంది. కాగా, నిందితుడు తన కేసును తనే వాదించుకోవటం గమనార్హం. టారాంట్ తీవ్రవాద భావాల ప్రచారానికి న్యాయస్థానం వేదిక కారాదనే ఉద్దేశంతో.. ఇతని వాదనలను మీడియాలో ప్రచురించడాన్ని కోర్టు నిషేధించింది.

ఇదీ చూడండి: అలా జరిగితే సైనిక చర్యే: చైనాకు రావత్ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.