ETV Bharat / international

'గాలి ద్వారా ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి' - కొత్తరకం స్ట్రెయిన్

శ్రీలంకలో కొత్తరకం కరోనాను గుర్తించారు అధికారులు. గాలి ద్వారా ఇది ఉద్ధృతంగా వ్యాప్తిస్తోందని పేర్కొన్నారు.

covid strain
కరోనా, కొత్త రకం వైరస్
author img

By

Published : Apr 25, 2021, 9:20 AM IST

గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్​ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా ఉద్ధృతంగా ఇది విస్తరిస్తోందని పేర్కొన్నారు.

ఈ వైరస్ గాల్లో దాదాపు గంటసేపు మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో ఎక్కువ యువత కొవిడ్-19 బారినపడుతోందని వివరించారు. దీనికి ఈ కొత్త రకమే కారణం కావొచ్చన్నారు. ఇది మూడో ఉద్ధృతికి దారితీయవచ్చని ప్రజారోగ్య నిపుణుడు ఉపుల్ రోహానా చెప్పారు.

ఇదీ చదవండి:గుర్రం వెంట్రుకలతో గాజులు- ఇది విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.