ETV Bharat / international

వివాదాస్పద 'మ్యాప్'కు నేపాల్​ పార్లమెంటు ఆమోదం​ - kalapanii in nepal map

nepals-upper-house-endorses-the-new-map-amendment-bill-coat-of-arms-proposal-unanimously
వివాదాస్పద 'మ్యాప్'కు నేపాల్​ ఎగువ సభ ఆమోదం​
author img

By

Published : Jun 18, 2020, 1:08 PM IST

Updated : Jun 18, 2020, 1:54 PM IST

13:40 June 18

భారత్​ భూములు మావే అంటున్న నేపాల్​ కొత్త మ్యాప్​..

వివాదాస్పద కాలాపానీతో పాటు మరో రెండు భారత ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్​ను ఆ దేశ పార్లమెంటు ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 57 మంది ఎంపీల ఓట్లతో నేపాల్ సరికొత్త​ పటానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడకపోవడం గమనార్హం.  

ఈ రాజ్యాంగ సవరణ బిల్లును దిగువ సభ ఇదివరకే ఏకగ్రీవంగా ఆమోదించింది.  

భారత్ లిపులేఖ్ నుంచి ధార్చులా వరకు నిర్మించిన 80 కి.మీ రహదారిని, మే 8 న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనిపై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల తరువాత నేపాల్ ప్రభుత్వం నిరసన తెలుపుతూ కొత్త పటాన్ని విడుదల చేసింది. లిపులేఖ్​, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్​ మ్యాప్​లో కనిపిస్తున్నాయి.  

13:03 June 18

వివాదాస్పద 'మ్యాప్'కు నేపాల్​ ఎగువ సభ ఆమోదం​

వివాదాస్పద నేపాల్ మ్యాప్​ సవరణ బిల్లుకు ఆ దేశ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పటికే దిగువ సభలో బిల్లు ఆమోదం పొందింది.

Last Updated : Jun 18, 2020, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.