ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఎదురుదెబ్బ తగిలింది. రద్దైన ప్రతినిధుల సభను నేపాల్ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఛోలేంద్ర షంషేర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది. ప్రతినిధుల సభను రద్దుచేయడం రాజ్యాంగ విరుద్ధమన్న కోర్టు.. 13 రోజుల్లోగా సభను సమావేశపరచాలని ఆదేశించింది.
అధికార పక్షంలో విభేదాల నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రతినిధుల సభ రద్దుకై నేపాల్ అధ్యక్షురాలికి సిఫార్సు చేశారు. ఓలి సిఫార్సు మేరకు అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీ 275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభను డిసెంబర్ 20న రద్దు చేశారు. ఏప్రిల్ 30 నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇదీ చూడండి: మారిషస్లో భారత దౌత్యకార్యాలయం ప్రారంభం