ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 64 లక్షల 69 వేలు దాటింది. 10 లక్షల 61 వేల 724మంది మృత్యువాత పడ్డారు.
రష్యాలో కొత్తగా 11 వేల 493 మంది కరోనా బారిన పడ్డారు. మరో 191మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 12 లక్షల 60 వేలు దాటింది.
మెక్సికోలో మరణమృదంగం..
మెక్సికోలో రోజూ సగటున 5 వేలు కేసులు బయటపడుతుండగా... మరణాలు మాత్రం అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా 378 మంది చనిపోయారు. కొత్తగా 4,580 మంది వైరస్ బాధితులుగా మారారు.
- ఇరాన్లో ఒక్కరోజే 4,392 కేసులు నమోదయ్యాయి. 230మంది మృతి చెందారు.
- ఇండోనేషియాలో 4,850 మందికి కొవిడ్ సోకింది. 108 మంది మహమ్మారికి బలయ్యారు.
- ఇరాక్‌లో 3,522 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 79మంది మరణించారు.
- ఉక్రెయిన్‌లో ఒక్కరోజే 5,397 కేసులు వెలుగు చూశాయి. 93మందిని కొవిడ్ బలి తీసుకుంది.
- నెదర్లాండ్స్‌లో తాజాగా 5,822 మంది కొవిడ్ బారిన పడగా.. 13 మంది మృతి చెందారు
- పోలాండ్‌లో 4,280 కేసులు నమోదవగా.. 76మంది మృత్యువాత పడ్డారు.
- నేపాల్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 4, 364కేసులు వెలుగుచూశాయి. మరో 12మంది మరణించారు.
ఇదీ చూడండి: ఇండోనేషియాలో విద్యార్థుల నిరసనల్లో హింస