నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ప్రభుత్వానికి సీపీఎన్ మావోయిస్ట్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ మద్దతు ఉపసంహరించుకోగా మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో ఈ బలపరీక్ష జరిగింది.
నేపాల్ పార్లమెంట్‌లో ఓలీ పార్టీ సీపీఎన్-యూఎంఎల్కు 121 సీట్లు ఉండగా సీపీఎన్ఎంకు 49 మంది చట్ట సభ్యులున్నారు.
బల నిరూపణకు ఆహ్వానం
నేపాల్‌లో మెజారిటీ నిరూపణకు పార్టీలకు అధ్యక్షురాలు విద్యాదేవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు బలాన్ని నిరూపించుకోవాలని పార్టీలను కోరారు. గురువారంలోగా ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాలని పార్టీలకు సూచించారు.