ETV Bharat / international

జనవరి 1నుంచి నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు - nepal National Assembly new session

నేపాల్ పార్లమెంటు రద్దైన వారం రోజుల తర్వాత జాతీయ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రపతి విద్యా దేవి భండారి. కొత్త సెషన్​ జనవరి 1నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఏడుగురు కేబినెట్​ మంత్రుల రాజీనామా నేపథ్యంలో తన మంత్రమండలిని విస్తరించారు ప్రధాని కేపీ శర్మ ఓలీ. కొత్తగా 8మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.

Nepal President calls new session of Upper House from January 1
జనవరి 1నుంచి నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు
author img

By

Published : Dec 26, 2020, 5:45 PM IST

నేపాల్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంటు ఎగువ సభ) నూతన సెషన్​ను జనవరి 1 నుంచి నిర్వహించనున్నట్లు ఆ దేశ రాష్ట్రపతి విద్యా దేవి భండారి తెలిపారు. నేపాల్​ కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా పార్లమెంటును డిసెంబర్​ 20న రద్దు చేశారు ప్రధాని కేపీ శర్మ ఓలి. అనంతరం వారం రోజుల తర్వాత జాతీయ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.

పార్లమెంటును రద్దు చేస్తూ ఓలీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్సీపీలోని ప్రచండ మద్దతుదారులు ఏడుగురు కేబినెట్​ మంత్రి పదవులకు గత వారమే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్​ను విస్తరించారు ఓలీ. ఒక సహాయ మంత్రి సహా మొత్తం 8మందికి నూతన మంత్రివర్గంలో చోటు కల్పించారు. కొత్త మంత్రులతో రాష్ట్రపతి విద్యా దేవి భండారి శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు.

ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ ప్రచండకు, ప్రధాని కేపీ శర్మ ఓలికి మధ్య గతకొంత కాలంగా తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే నేపాల్​ పార్లమెంటును రద్ధు చేశారు ఓలీ. ఈ విషయంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. పార్లమెంటును అర్థాంతరంగా రద్దు చేసిన విషయంపై రాతపూర్వకంగా స్పష్టత ఇవ్వాలని ఓలీ ప్రభుత్వాన్ని నేపాల్​ సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: పార్లమెంటు రద్దుపై నేపాల్​ ప్రధానికి నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.