ETV Bharat / international

'ఏ నిబంధనతో పార్లమెంట్​ను రద్దు చేశారు?'

author img

By

Published : Jan 16, 2021, 3:09 PM IST

నేపాల్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్​ను రద్దు చేస్తున్నారో ప్రధాని కేపీ శర్మ ఓలీ.. రాష్ట్రపతికి చేసిన సిఫార్సులో తెలపలేదని సుప్రీంకోర్టు నుంచి లీకైన పేపర్లలో వెల్లడైంది. ఈ పేపర్లను కోర్టు ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్​లో సుప్రీంకోర్టుకు ప్రధానమంత్రి కార్యాలయం సమర్పించింది. నేపాల్​ పార్లమెంట్​ను డిసెంబర్​ చివరివారంలో రద్దు చేశారు ఆ దేశ ప్రధాని.

Nepal PM Oli recommended house dissolution without mentioning constitutional clauses, reveal leaked papers
నేపాల్ పార్లమెంట్​ రద్దుపై లీకైన సుప్రీంకోర్టు కీలక పేపర్స్​

నేపాల్​ పార్లమెంట్​ రద్దుపై ఆ దేశ సుప్రీంకోర్టు నుంచి కీలక పేపర్లు లీక్​ అయ్యాయి. వీటి ప్రకారం.. రాజ్యాంగంలోని ఏ అధికరణ, ఏ నిబంధన​ల ప్రకారం పార్లమెంట్​ను రద్దు చేస్తున్నారో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీకి తెలపలేదని తేలింది. 2020 డిసెంబర్ చివరి వారం​లో.. పార్లమెంట్​ను రద్దు చేసిన అనంతరం కోర్టుకు ఓలి ప్రభుత్వం ఈ ప్రతులను సమర్పించింది.

'పార్లమెంట్​ రద్దుకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం ఉంది. అయితే నేపాల్​ రాజ్యంగం, పార్లమెంటరీ వ్యవస్థ విలువలను పరిగణించి.. ఏప్రిల్​ 30, మే 10న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో.. ప్రస్తుత ప్రతినిధుల సభను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతున్నాం,' అని లీకైన పేపర్లలో ఉంది. ఈ 8 పాయింట్ల ప్రతుల్లో రాజ్యంగ అధికరణ, క్లాజ్​లను మాత్రం ప్రస్థావించలేదు.

అయితే ఈ ప్రతులకు సంబంధించి అసలైన కాపీని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టు నేపాల్​ సీజేఐ జేబీ రాణా వెల్లడించారు.

ఇదీ చదవండి : నేపాల్ పార్లమెంటు రద్దు- వేసవిలో ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.