ETV Bharat / international

నేపాల్​ ప్రధాని ఓలి రాజీనామా చేయనున్నారా? - నేపాల్​ పార్లమెంట్​

నేపాల్​లో రద్దైన ప్రతినిధుల సభను పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రధాని కేపీ శర్మ ఓలికి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం తీర్పుతో ఓలి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తేలిందని, రాజీనామా చేయాలని డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలో స్పష్టతనిచ్చారు ఓలి మీడియా సలహాదారు సూర్య తాపా. ఇప్పట్లో రాజీనామా చేసే యోచన లేదని తెలిపారు.

Nepal PM Oli
ప్రధాని కేపీ శర్మ ఓలి
author img

By

Published : Feb 24, 2021, 3:55 PM IST

నేపాల్​ పార్లమెంట్​ను పునరుద్ధరించాలని ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాకు డిమాండ్లు పెరిగాయి. అయితే... ఓలి ఇప్పట్లో రాజీనామా చేయరని, రెండు వారాల్లో సమావేశం కానున్న పార్లమెంట్​ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన మీడియా సలహాదారు​ సూర్య తాపా తెలిపారు.

" సుప్రీం కోర్టు తీర్పు వివాదాస్పదం. ఏదేమైనా, దానిని అంగీకరించాలి, అమలు చేయాలి. ఈ నిర్ణయం రాజకీయ సమస్యలకు ఎటువంటి పరిష్కారం ఇవ్వదు. అలాగే భవిష్యత్తులో దీని ప్రభావాలు కనిపిస్తాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు.. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తుంది. అలాగే.. పవర్​ ప్లేకు మార్గం సుగమం చేస్తుంది. కోర్టు తీర్పును అమలు చేయడానికి ప్రధాని ప్రతినిధుల సభను ఎదుర్కొంటారు. కానీ, ఇప్పుడే రాజీనామా చేయరు. "

- సూర్య తాపా, ఓలి మీడియా సలహాదారు

కోర్టు తీర్పును అనుసరించి తన పదవికి రాజీనామా చేయాలని ప్రధాని ఓలిపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఈ మేరకు తాపా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది. సూర్య తాపా వ్యాఖ్యలను సమర్థించారు ఓలి ప్రధాన సలహాదారు బిష్ణు రిమాల్​​. కోర్టుల నిర్ణయాలను అందరూ అంగీకరించాలన్నారు. అయినప్పటికీ రాజకీయ సమస్యలకు అవి ఎలాంటి పరిష్కారం చూపవని అభిప్రాయపడ్డారు.

తీర్పును స్వాగతించిన నేపాల్​ మీడియా..

ప్రతినిధుల సభను తిరిగి పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నేపాల్​కు చెందిన చాలా మీడియా సంస్థలు స్వాగతించాయి. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని న్యాయస్థానం కాపాడిందని కొనియాడాయి. 'తాజా తీర్పుతో సుప్రీం కోర్టు మరోమారు ప్రజల పక్షాన నిలిచింది. స్వతంత్ర న్యాయవ్యవస్థ భావనను తిరిగి స్థాపించింది.' అని కాఠ్​మాండూ పోస్ట్​ తన సంపాదకీయంలో రాసుకొచ్చింది.

ఓలి రాజీమానాకు డిమాండ్​..

మరోవైపు.. ఇన్నాళ్లు ప్రధాని ఓలీ, ప్రచండ, మాధవ్​ కుమార్​తో సమన్వయంగా వ్యవహరించిన నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ ఉపాధ్యక్షుడు బామ్​దేవ్​ గౌతమ్​.. తాజాగా ఓలి తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. 'ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు ద్వారా తేలింది. ఈ క్రమంలో ఆయన వెంటనే రాజీనామా చేయాలి' అని పేర్కొన్నారు. ప్రజలకు ఓలి క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు దహల్​ నేపాల్​ పార్టీ ఇంఛార్జి బీమ్​ రావల్.

ఇదీ చూడండి: ఓలికి ఎదురుదెబ్బ- ప్రతినిధుల సభ పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.