రెండు రోజుల నేపాల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. ద్వైపాక్షిక సమస్యలపై నేపాల్ అధికారులతో కీలక చర్చలు జరపగా.. పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు అంగీకరించాయి.
నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శి భరత్ రాజ్ పౌడ్యాల్.. ఆహ్వానం మేరకు నేపాల్ వెళ్లిన ష్రింగ్లాకు ఘన స్వాగతం పలికారు ఆ దేశ అధికారులు. అనంతరం ఆ దేశ అత్యున్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు కీలక అంశాల గురించి చర్చించారు. ఈ క్రమంలోనే నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని ఆమె అధికారిక నివాసంలో కలిశారు.
ఈ పర్యటనలో భాగంగా కరోనా కొనసాగుతున్న వేళ.. నేపాల్‌కు నిరంతర సహాయంలో భాగంగా రెమ్‌డెసివిర్ యాంటీ-వైరల్ ఔషధాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలికి అందజేశారు ష్రింగ్లా.
ఇదీ చూడండి: భూలోకస్వర్గాన్ని తలపిస్తున్న వాయవ్య చైనా