పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. తీవ్రమైన అనారోగ్యం బారినపడ్డారని మీడియా నివేదికలు వెల్లడించాయి. లండన్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు కిడ్నీలో రాళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తీవ్ర నొప్పితో ఆస్పత్రులకు తిరుగుతున్నట్లు సమాచారం.
''నవాజ్ షరీఫ్‌కు ఆరోగ్యం ఏం బాగోలేదు. మూత్రపిండాల పనితీరు క్షీణించడం వల్ల.. ఆయన తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. ఆయన వైద్యచికిత్సకు సంబంధించి.. పరీక్షలు, స్కానింగ్‌లు నిర్వహిస్తున్నట్లు'' వైద్యుడు అద్నాన్ ఖాన్ అన్న మాటలను డాన్ పత్రిక ఉటంకించింది.
కిడ్నీ నొప్పుల కారణంగా.. తన తండ్రి పాకిస్థాన్ డెమొక్రాటిక్ మూవ్మెంట్లో పాల్గొనలేకపోతున్నారని షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ మంగళవారం ట్వీట్ చేశారు.
ఆ కేసుల్లో బెయిల్‌పై..
అవెన్‌ఫీల్డ్ ఆస్తుల కేసులో.. షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్లపై 2018, జులై 6న కేసు నమోదైంది. 2017లో ప్రధాని పదవి కోల్పోయిన ఆయనకు.. ఆల్ అజీజ్ స్టీల్ మిల్స్ కేసులో ఏడేళ్ల శిక్ష పడింది.
ఈ రెండు కేసుల్లో బెయిల్ పొందిన ఆయన చికిత్స నిమిత్తం లండన్ వెళ్లి అక్కడే ఉండిపోయారు.