ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బుధవారం రష్యా పర్యటనకు బయలుదేరారు. గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అత్యున్నత స్థాయి చర్చలు జరపనున్నారు కిమ్. ప్రత్యేక రైలులో బుధవారం ఉదయం రష్యాకు పయనమయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- కిమ్ మధ్య జరిగిన అణు చర్చలు విఫలమైన రెండు నెలల అనంతరం ఈ భేటీ జరగనుండటం విశేషం.
పుతిన్- కిమ్ భేటీలో ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
ఇదీ చూడండి: సీజేఐపై అంతర్గత విచారణకు ప్రత్యేక ప్యానెల్