ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశ అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటామని, అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేస్తామని హెచ్చరించారు. ఇరు దేశాల బంధం.. తమపై అనుసరిస్తున్న కఠిన విధానాలను రద్దు చేసుకునే అంశంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తరకొరియా ప్రభుత్వ ఆధారిత మీడియా కథనం ప్రచురించింది.
పాంగ్యాంగ్లో జరుగుతున్న అధికార పార్టీ కాంగ్రెస్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కిమ్. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్‌పై ఒత్తిడి పెంచేందుకే కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శత్రువులు తమ అణ్వాయుధాలను ఉపయోగించనంత వరకు తాను కూడా ఎలాంటి ఆయుధాలను ప్రయోగించనని పేర్కొన్నారు కిమ్. అయితే ఉత్తరకొరియాపై అమెరికా దండయాత్ర చేసే అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయని.. అందువల్ల దేశ సైనిక శక్తిని మరింత పెంపొందించుకునే అవసరం ఉందని వెల్లడించారు.
ఇవీ చూడండి:-