ETV Bharat / international

'నమ్మండి ప్లీజ్... మా దేశంలో ఎవరికీ కరోనా రాలేదు!' - north korea coronavirus latest news

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఉత్తరకొరియాలో మాత్రం అడుగు పెట్టలేకపోయిందట. ఎన్నో దేశాలకు విస్తరించి దాదాపు పదిలక్షల మందికి సోకిన వైరస్.. తమ దేశంలో ఒక్కరికి కూడా సోకలేదని ఉత్తరకొరియా అధికారులు ప్రకటించారు.

N. Korea insists it is free of coronavirus
'కిమ్​' రాజ్యంలో అడుగుపెట్టలేకపోయిన 'కరోనా'..!
author img

By

Published : Apr 2, 2020, 2:08 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్నప్పటికీ.. తమ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని పునరుద్ఘాటించింది ఉత్తర కొరియా. ముందస్తు జాగ్రత్తలతోనే ఇది సాధ్యపడిందని చెబుతోంది.

చైనాలో కరోనా​ తొలి కేసు ఉద్భవించిన కొద్ది రోజులకే.. ఈ ఏడాది జనవరిలో తమ దేశ సరిహద్దులను మూసివేసినట్లు తెలిపారు ఉత్తర కొరియా అధికారులు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేలా పలు కఠిన ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.

" మా దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ముందస్తుగా స్పందించి దేశంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ పరీక్షించి క్వారంటైన్‌కు తరలించడం, సరుకులను శుద్ధిచేయడం వంటి చర్యలు చేపట్టాం. సరిహద్దులు, సముద్ర, వాయు మార్గాలను మూసేశాం. ఫలితంగా ఇప్పటివరకు మా దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు."

- ఉత్తర కొరియా అధికారులు

'కొరియా దాచిపెడుతోంది'

ఉత్తర కొరియా కరోనా వైరస్ కేసులను దాచిపెడుతోందని విమర్శిస్తున్నారు నిపుణులు. బలహీనమైన వైద్య వ్యవస్థగల ఉత్తర కొరియాలో వైరస్ విస్తరించే ప్రమాదం అధికమని విశ్లేషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.