ETV Bharat / international

'ప్లీజ్..​ మా దేశంలో ప్రజాస్వామ్యాన్నిబతికించండి' - ఐరాసలో మియన్మార్ దేశ రాయబారి కయాన్​ మోతున్

మయన్మార్​లో సైనిక తిరుబాటును తీవ్రంగా ఖండిస్తూ బహిరంగ ప్రకటన జారీ చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని విజ్ఞప్తి చేశారు ఆ దేశ రాయబారి కయాన్​ మోతున్​ . తమ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని ఐరాస సమావేశంలో కోరారు.

Myanmar
'ప్లీజ్..​ మా దేశంలో ప్రజాస్వామ్యాన్నిబతికించండి'
author img

By

Published : Feb 27, 2021, 12:09 PM IST

మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు అంతర్జాతీయ సమాజం సహకరించాలని ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి కయావ్ మోతున్ విజ్ఞప్తి చేశారు.

ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన తమ దేశంలో సైనిక తిరుగుబాటును తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ప్రజలు ఎనుకున్న పౌర ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని స్పష్టం చేశారు. మియన్మార్‌లో సైనిక పాలన వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇది చదవండి: 'మయన్మార్​లో పరిస్థితులను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది'

సైనిక తిరుగుబాటును తీవ్రంగా ఖండిస్తూ బహిరంగ ప్రకటనలు జారీ చేయాలని‌ అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థించారు. శాంతియుత ప్రదర్శనకారులపై సైన్యం హింసను ఆపేందుకు అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆధునిక ప్రపంచంలో సైనిక తిరుగుబాటు ఆమోదయోగ్యం కాదని కయావ్‌ అభిప్రాయపడ్డారు. కయావ్‌ చేసిన ఈ ఆశ్చర్యకర ప్రకటన.. సభ్య దేశాల ప్రశంసలు అందుకుంది. కయావ్‌ ధైర్యవంతుడని సభ్య దేశాల ప్రతినిధులు కొనియాడారు.

ఇవీ చదవండి:

అంతర్జాతీయ సమాజం వైపు మయన్మార్​ ప్రజల చూపు!

మయన్మార్​లో ఆగని పౌర నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.