ETV Bharat / international

Suu kyi court sentence: ఆంగ్ సాన్ సూకీకి మరో నాలుగేళ్లు శిక్ష - ఆంగ్ సాన్ సూకీ జైలుశిక్ష

మయన్మార్​ నేత ఆంగ్​ సాన్​ సూకీకి మరో నాలుగేళ్లు శిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. వాకీ-టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం, కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది.

Suu Kyi court sentence
Suu Kyi court sentence
author img

By

Published : Jan 10, 2022, 12:19 PM IST

Suu kyi court sentence: పలు క్రిమినినల్​ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న మయన్మార్‌ కీలక నేత ఆంగ్​ సాన్​ సూకీకి ప్రత్యేక కోర్టు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది. వాకీ-టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం.. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

గత నెలలో ఆంగ్‌సాన్‌ సూకీని ఇతర కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు.. నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై వ్యతిరేకత రావడంతో సైన్యం దాన్ని సగానికి తగ్గించింది.

ఎన్నికల్లో అక్రమంగా గెలిచారంటూ గతేడాది ఫిబ్రవరిలో సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం.. ఆమెపై పలు కేసులు పెట్టింది. సైన్యం తమ చర్యలను సమర్థించుకోవడానికి సూకీపై అనవసరంగా కేసులు మోపుతున్నారని ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆంగ్‌సాన్‌ సూకీ మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని వెల్లడించారు.

జీవితాంతం నిర్బంధంలోనేనా..!

1989-2010 మధ్యలో ఆంగ్‌ సాన్‌ సూచీని దాదాపు పదిహేనేళ్లు గృహ నిర్బంధంలోనే సైన్యం ఉంచింది. ఇప్పుడు మరిన్నిఅభియోగాల్లో దోషిగా తేల్చింది. మిగిలిన వాటిలోనూ దోషిగా తేలితే.. వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే 76 ఏళ్ల సూచీ.. మిగిలిన జీవితమంతా బందీగానే గడపాల్సి ఉంటుంది.

అటు సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్​ ప్రజలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. 10నెలలు గడిచినా, సైనిక పాలనను అంగీకరించడం లేదు. సూకీతో పాటు నిర్బంధించిన నేతలందరినీ విడుదల చేసి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆమోదించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి:

కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆంగ్​సాన్​ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష

నిరసన గళాలపై ఉక్కుపాదం- సైనిక నేతల అతిపోకడ

'మరో రెండేళ్ల పాటు నేనే ప్రధాని'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.