2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి ప్రయత్నించిందన్న ఆరోపణల్ని మరోమారు తోసిపుచ్చింది పుతిన్ ప్రభుత్వం. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ మ్యూలర్ సమర్పించిన నివేదికను తప్పుబట్టింది.
"అమెరికా ఎన్నికల ప్రక్రియలో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై మ్యూలర్ నివేదిక ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. అందులో కొత్త సమాచారమేమీ లేదు. అమెరికా-రష్యా ద్వైపాక్షిక బంధంపై ఈ పత్రాలు నేరుగా ప్రభావం చూపుతాయని చింతిస్తున్నాం."
- దిమిత్రి పెస్కోవ్, రష్యా ప్రభుత్వ ప్రతినిధి
ఎలాంటి ఫలితంలేని దర్యాప్తు కోసం తమ డబ్బులు ఎందుకు ఖర్చు చేశారో అమెరికా పన్ను చెల్లింపుదారులు నిలదీయాలని సూచించారు పెస్కోవ్.
ఇదీ చూడండి: మరే అధ్యక్షుడికీ ఇలా జరగకూడదు : ట్రంప్