శుక్రవారం ప్రార్థనలకు వచ్చేవారే లక్ష్యంగా దాడులు చేశారు ముష్కరులు. కుచ్లక్ ప్రాంతంలో నెల రోజుల్లోనే ఇలాంటి దాడి జరగటం ఇది నాలుగోసారి.
దాడి సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. క్షతగాత్రులను క్వెట్టా ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మసీదులో సుమారు 10 కిలోల బరువైన ఐఈడీ బాంబును పేల్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో తరచుగా తాలిబన్, బలోచ్ నేషనలిస్ట్ సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడుతుండటం వల్ల... ఇది కూడా వాటి పనేనని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: భారత దౌత్యవేత్తకు పాకిస్థాన్ సమన్లు