ETV Bharat / international

కాబుల్​ మృతులు 180 మంది.. మరిన్ని దాడులకు అవకాశం! - కాబుల్ విమానాశ్రయం

కాబుల్ విమానాశ్రయం ఆత్మాహుతి దాడుల్లో(Kabul Airtport blast) మృతుల సంఖ్య 180 మందికి పైనే ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. వీరిలో 169 మంది అఫ్గాన్లే ఉన్నారన్న అధికారులు మృతుల్లో 28 మంది తాలిబన్లు(Afghan Taliban) కూడా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని దాడులు జరగొచ్చంటూ అమెరికా తాజా హెచ్చరిక జారీచేసింది.

kabul airport blast
ఆత్మాహుతి దాడులు
author img

By

Published : Aug 28, 2021, 5:00 AM IST

Updated : Aug 28, 2021, 6:39 AM IST

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ చివురుటాకులా వణికిపోతోంది. ఐసిస్‌ ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు దాడులతో(Kabul Airport blast) ఇక్కడి హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాలు కకావికలమయ్యాయి. మృతుల సంఖ్య 182కి చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు ముష్కరులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరించింది. కాబుల్‌లో గురువారం సాయంత్రం జంట పేలుళ్ల తర్వాత పరిస్థితి భీతావహంగా మారడంతో పాటు.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు మిన్నంటాయి. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేకపోయినా, ప్రాణాలు దక్కించుకోవడం ఎలాగన్న ఆత్రుత.. తదుపరి విమానం ఎక్కయినా దేశాన్ని విడిచే అవకాశం రాకపోతుందా అన్న ఉత్కంఠ.. విమానాశ్రయ పరిసరాల్లో నెలకొన్నాయి.

'ఐఎస్‌ఐఎస్‌-కే' పనే..

జంట పేలుళ్లలో మృతిచెందిన వారిలో 28 మంది తాలిబన్లు(Afghan Taliban) సహా మొత్తం 169 మంది అఫ్గాన్లు ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక అధికారులు శుక్రవారం వెల్లడించారు. చనిపోయినవారిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. పేలుళ్ల ధాటికి గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. ఈ ఆత్మాహుతి దాడులకు(Suicide attack) పాల్పడింది తామేనని ఐఎస్‌కేపీ (ఐఎస్‌ఐస్‌-కే) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇక దేశంపై పూర్తి ఆధిపత్యం తమదేనని.. ఇతరులకు హాని తలపెట్టే ఉగ్రవాదులకు తమ భూభాగంలో చోటే ఉండదని.. విదేశీ పౌరుల తరలింపు పూర్తయ్యేవరకూ ఎలాంటి దాడి జరగబోదంటూ ప్రపంచ దేశాలకు ధీమాగా చెబుతూ వచ్చిన తాలిబన్‌.. ఐస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను నిలువరించలేకపోతోంది! మరోవంక కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ముష్కరులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకన్జీ ప్రకటించారు.

పేలుళ్లకు ముందు కాల్పులు...

కాబుల్‌ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించడానికి ముందు విమానాశ్రయం వద్ద జనం పరుగులు తీస్తున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విమానాశ్రయం అమెరికా బలగాల ఆధ్వర్యంలోనే ఉంది. అయితే, ఎయిర్‌పోర్టు వెలుపల, అక్కడ పోటెత్తుతున్న జనాన్ని సాయుధ తాలిబన్లు నియంత్రిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పినప్పుడల్లా వారు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. గురువారం వారు కాల్పులు జరపడంతోనే జనం భయంతో పరుగులు తీస్తున్నట్టు ఆ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ముష్కరులు బాంబులతో వచ్చి ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. వారితో పాటు వచ్చిన మరో వ్యక్తు తుపాకీతో కాల్పులు జరిపాడు.

తప్పించుకున్న సిక్కులు, హిందువులు!

జంట పేలుళ్లను అఫ్గాన్‌లోని సిక్కులు, హిందువులు త్రుటిలో తప్పించుకున్నారు. ఇవి జరగడానికి కొన్ని గంటల ముందే 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నట్టు పలువురు సిక్కులు తెలిపారు. విమానాశ్రయం లోనికి వెళ్లేందుకని పేలుడు సంభవించిన ప్రాంతంలోనే కొన్ని గంటలపాటు వేచి చూసినట్లు పేర్కొన్నారు.

పాక్‌ నుంచి తాలిబన్లు బుకాయింపులు నేర్చుకున్నారు: అమ్రుల్లా సలేహ్‌

అఫ్గాన్‌ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్‌ జంట పేలుళ్లపై స్పందించారు. 'తాలిబన్‌-హక్కానీ నెట్‌వర్క్‌ల్లో ఐసిస్‌-కె మూలాలున్నాయి. తాలిబన్లు ఈ విషయాన్ని తిరస్కరించడం ఎలా ఉందంటే.. ఒకప్పుడు క్వెట్టా షురా అనే మిలిటెంట్‌ సంస్థతో తమకు సంబంధాలు లేవని పాకిస్థాన్‌ బుకాయించినట్లుంది. తన గురువు (పాక్‌) నుంచి తాలిబన్లు చాలా నేర్చుకొన్నారు' అని సలేహ్‌ ట్వీట్‌ చేశారు.

2011 తర్వాత ఇదే పెద్దదాడి

కాబుల్‌ విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడుకు 13 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. అయితే 2011 తర్వాత ఈ స్థాయిలో అమెరికా భద్రత సిబ్బంది చనిపోవడం మళ్లీ ఇప్పుడే. 2011 ఆగస్టు 6న అఫ్గాన్‌లోని వార్దక్‌ రాష్ట్రంలో ఉగ్రవాద శిబిరంపై అమెరికా తన చినూక్‌ హెలికాఫ్టర్‌తో దాడికి దిగింది. కానీ, ఉగ్రవాదులు ఆ హెలికాప్టర్‌ను కూల్చేశారు. ఈ ఘటనలో 23 మంది నేవీ సీల్స్‌ సహా 30 మంది అమెరికా సిబ్బంది, 8 మంది అఫ్గాన్‌ పౌరులు మరణించారు. అమెరికాకు చెందిన ఓ జాగిలం కూడా మృత్యువాత పడింది.

చావోరేవో వెళ్లిపోతాం...ఇక్కడైతే ఉండలేం...

దాడులు జరుగుతాయని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా.. కాబుల్‌ విమానాశ్రయానికి జనం పోటెత్తుతూనే ఉన్నారు. 'అఫ్గాన్‌లో ఏ మూల ఉన్నా మా ప్రాణాలకు ముప్పు తప్పదు. ఏదోలా దేశాన్ని విడిచి వెళ్లిపోవడమే మేలు. చావోరేవో.. ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి' అని అక్కడికి భారీగా తరలివస్తున్న జనం చెబుతున్నారు. కాబుల్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా పరిస్థితులు భయానకంగా, గుంభనంగా కనిపిస్తున్నాయి. పేలుళ్ల క్రమంలో విమానాశ్రయం లోపల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, కొద్ది గంటల విరామం తర్వాత విమానాల రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అత్యవసర చర్యల కింద కార్యకలాపాలను పునఃప్రారంభించినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

kabul airport blast: 'అఫ్గాన్​లో పరిస్థితులు ఆందోళనకరం'

తాలిబన్ల చేతికి 'కిల్​ లిస్ట్​'.. ఇచ్చింది అమెరికానే!

కాబుల్​ పేలుళ్లకు తాలిబన్ల సాయం! ఆ రెండు చెక్​పోస్టులు దాటించి...

Last Updated : Aug 28, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.