ETV Bharat / international

బంగ్లాదేశ్​లో ఇస్కాన్ ఆలయంపై దాడి- 200 మంది కలిసి దండెత్తి..

author img

By

Published : Mar 18, 2022, 5:21 PM IST

Updated : Mar 18, 2022, 5:41 PM IST

Mob Attacked on ISKCON Temple: బంగ్లాదేశ్​ ఢాకాలో హిందూ మైనారిటీలపై మరోసారి దాడి జరిగింది. ఇస్కాన్ రాధాకాంత ఆలయాన్ని దాదాపు 200 మంది దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న భక్తులపై దాడి చేశారు.

Mob Attacked on ISKCON Temple
దాడి

Mob Attack on ISKCON Temple: బంగ్లాదేశ్​లో ఇస్కాన్ భక్తులపై దాదాపు 200 మంది మూక దాడి చేశారు. ఇస్కాన్ రాధాకాంత ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన బంగ్లా రాజధాని ఢాకాలో జరిగింది.

'గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ రాధాకాంత​ ఆలయంలో గురువారం సాయంత్రం వేడుకలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో 200 మంది దుండగులు ఆలయం పరిసరాలలోకి ప్రవేశించి భక్తులపై దాడి చేశారు. ఆలయాన్ని ధ్వంసం చేశారు. ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులకు ఫోన్ చేయగా.. దుండగులు పారిపోయారు.' అని ఇస్కాన్​ కోల్​కతా ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ చెప్పారు.

ఇస్కాన్ ఆలయం ఉన్న స్థలం చాలాకాలంగా వివాదంలో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై బంగ్లాదేశ్ అధికారులతో భారత విదేశాంగ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ దాడి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని దాస్ అన్నారు. మైనారిటీలకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది అక్టోబర్​లో హిందూ మైనారిటీలపై దాడి అనంతరం మళ్లీ ఈ ఘటన జరిగింది. మత గ్రంథాన్ని అవమానించారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో గత ఏడాది అక్టోబర్ 13న మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇది దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో హింసకు దారితీసింది.

ఇదీ చదవండి: భారత్​పై పాక్​ 'రివెంజ్​ షో' అట్టర్​ ఫ్లాప్​- గాల్లోనే పేలిపోయిన మిసైల్!

Last Updated : Mar 18, 2022, 5:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.