పాకిస్థాన్‌లో ఓ మిలటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో పైలట్, కో-పైలట్ సహా.. ఇద్దరు సైనికులు ఉన్నారు. ఈ మేరకు పాక్ సైనిక విభాగం ఆదివారం వెల్లడించింది.
ఉత్తర పాక్‌లోని ఆస్టోర్ జిల్లా, మినిమార్గ్ ప్రాంతంలో ప్రయాణిస్తోన్న హెలికాప్టర్లో ఉన్నట్టుండి సాంకేతిక లోపాలు తలెత్తినందున ఈ ప్రమాదం సంభవించింది. మంచులో చిక్కుకుని మరణించిన ఓ సైనికుడి మృతదేహాన్ని హెలికాప్టర్లో తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఆటస్థలంలో కాల్పుల కలకలం- ముగ్గురు మృతి